ETV Bharat / business

విమానాల్లో మధ్య సీటు మాటేమిటో..?

author img

By

Published : Jun 11, 2020, 9:09 AM IST

లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన క్రమంలో దేశీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విమానాల్లో 3 వరుస సీట్లలో మధ్య సీటు ఖాళీగా వదలాలన్న ఆదేశాలపై అనిశ్చితి కొనసాగుతోంది. వందేభారత్​ విమానాల్లో మాత్రం మధ్యసీటు భర్తీకి వీలు కల్పించినా.. మిగిలిన విమానాల్లో షరతులు విధించింది డీజీసీఏ. అమెరికాలోనూ ఇదే అనిశ్చితి నెలకొంది.

Uncertainty over mid-seat replacement in aircraft
విమానాల్లో మధ్య సీటు మాటేమిటో..

కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో, దేశీయంగా విమాన సర్వీసులు నడుస్తున్నా, సాధారణ షెడ్యూల్‌తో పోలిస్తే, మూడోవంతు మాత్రమే కొనసాగుతున్నాయి. విమానాల్లో 3 వరుస సీట్లలో మధ్యసీటు ఖాళీగా వదలాలన్న ఆదేశాలపై అనిశ్చితి కొనసాగుతోంది. విదేశాల్లో ఉండిపోయిన భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న 'వందేభారత్‌' విమానాల్లో మాత్రం మధ్యసీటు భర్తీ చేసుకునే వీలు కల్పించినా, మిగిలిన విమానాల్లో షరతులతో మాత్రమే భర్తీ చేసుకునే వీలు కల్పించారు. ఆ మార్గంలో సర్వీసులకు గిరాకీ అధికంగా ఉన్నప్పుడు, లేదా కుటుంబసభ్యులు బుక్‌ చేసుకున్నప్పుడు మాత్రం మధ్య సీటు కేటాయించవచ్చని పేర్కొన్నారు.

భర్తీకే మొగ్గు!..

విమానాల్లో మధ్యసీటు ఖాళీగా ఉంచడంపై పౌరవిమానయాన శాఖ కూడా అంత సుముఖంగా లేదు. దేశీయ సర్వీసుల పునఃప్రారంభానికి ముందు మంత్రి హర్‌దీప్‌సింగ్‌ వ్యాఖ్యలూ అలానే ఉన్నాయి. అయితే డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) జారీచేసిన మార్గదర్శకాల్లో ఈ నిబంధన విధించారు. ఈ ప్రకారం వందేభారత్‌ విమానాల్లో భౌతికదూరం నిబంధన పాటించకపోవడంపై ఎయిరిండియా పైలట్‌ ఒకరు బోంబే హైకోర్టును ఆశ్రయించగా, మధ్యసీటు ఖాళీగా ఉంచమని ఆదేశించింది. తదుపరి ఈ కేసు సుప్రీంకోర్టును చేరగా, జూన్‌ 6 వరకు మాత్రం వందేభారత్‌ విమానాల్లో మధ్యసీటును భర్తీ చేయమని, తదుపరి డీజీసీఏ ఆదేశాలు పాటించాలని పేర్కొంది. తాకితేనే కొవిడ్‌-19 వ్యాపించదంటూ పౌరవిమానయాన శాఖ అందించిన ఒక నివేదికను పరిగణనలోకి తీసుకున్న బోంబేహైకోర్టు మధ్యసీటు భర్తీకి ఎయిరిండియాకు అనుమతించింది. డీజీసీఏ మాత్రం సాధ్యమైనంత వరకు మధ్యసీటు ఖాళీగా ఉంచాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. గిరాకీ అధికంగా ఉన్నా, కుటుంబసభ్యులంతా కలిసి బుక్‌ చేసుకున్నా, మధ్యసీటు భర్తీ చేయొచ్చని తెలిపింది. కాకపోతే, ప్రత్యేక వ్యక్తిగత సంరక్షణ పరికరాలు (పీపీఈ) మధ్యసీటు వ్యక్తులకు అందించాలని పేర్కొంది.

  • ప్రస్తుతానికి చూస్తే, ఎయిరిండియా వందేభారత్‌ విమానాల్లో మాత్రమే మధ్యసీటు భర్తీకి ఖచ్చితమైన అనుమతి ఉంది. మిగిలిన విమానాల్లో షరతులపై మాత్రమే భర్తీ చేసుకునే వీలుంది.
  • కరోనా వైరస్‌ వ్యాధికి గురైన వ్యక్తికి, లక్షణాలు వెంటనే బయటపడటం లేదు కనుక, సాధ్యమైనంత వరకు మధ్యసీటు ఖాళీగా ఉంచాలనే భావన వ్యక్తమవుతోంది. రద్దీ ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదని, ఇలా చేయాలంటే, టికెట్ల ధరలు భారీగా పెంచాల్సి వస్తుందని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. దేశీయంగా ఆగస్టు వరకు విమాన ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించినందున, సీటును వదిలేయలేమని అంటున్నాయి.
  • విమానాల్లోని ఫిల్టర్లు గాలిలోని వైరస్‌ కణాలను 99 శాతం వరకు తొలగిస్తాయని వివరిస్తూ, అమెరికా విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ఇమెయిల్‌ ద్వారా వీడియోలు పంపాయి. అక్కడి డెల్టా, స్పిరిట్‌, జెట్‌బ్లూ వంటి సంస్థలు ఖాళీగా ఉంచుతున్నా, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దీగా ఉన్నపుడు భర్తీ చేస్తోంది.
  • దేశీయంగా విమానాలను ప్రతి సర్వీసుకు ఇన్ఫెక్షన్‌ రహితంగా తీర్చిదిద్దుతున్నారు. సిబ్బందికి ఫేస్‌షీల్డ్‌లు, ప్రత్యేక గౌన్‌లు, ప్రయాణికులకు మాస్క్‌లు, శానిటైజర్‌ కిట్లు ఇవ్వడమే కాక, విమానం బయలుదేరేముందు కూడా థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి, అనుమానం ఉన్న ప్రయాణికులను దించివేస్తున్నారు. రద్దీ మేరకు అన్ని సీట్లు భర్తీ చేస్తున్నారని ఒక విమానయాన సంస్థ ముఖ్య అధికారి ‘ఈనాడు’తో చెప్పారు.

ప్రైవేటు సంస్థలకూ అవకాశం!

వందేభారత్‌ సర్వీసుల నిర్వహణకు ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, విస్తారా కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనిపై సంబంధిత సంస్థల నిర్వాహకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని సమాచారం. త్వరలోనే ఇది సాకారం కావచ్చని అంటున్నారు. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమన్‌, సౌదీఅరేబియా, ఖతార్‌, బహ్రెయిన్‌ వంటి దేశాలకు ప్రైవేటు సర్వీసులు నడిచే వీలుంది. ఈనెల 11-30 మధ్య అమెరికా, కెనడాల నుంచి 70 విమానాలను ఎయిరిండియా నిర్వహించబోతోంది.

ఇదీ చూడండి: భారత్​లోకి 'ఎంఐ ల్యాప్​టాప్​'.. ఈ రోజే విడుదల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.