ETV Bharat / business

ట్విట్టర్​పై యూజర్ల అసంతృప్తి ఎందుకో తెలుసా? - కొత్త అప్​డేట్​

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ డెస్క్​టాప్ వెర్షన్​ను అప్​డేట్ చేసింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ అప్​డేట్లపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్​పై యూజర్ల అసంతృప్తి
author img

By

Published : Jul 17, 2019, 4:53 PM IST

మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్​ డెస్క్​టాప్​ వెర్షన్​లో మార్పులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే ఈ అప్​డేట్​లను అందుబాటులోకి తెచ్చింది ట్విట్టర్​. ఈ మార్పుపై ట్విట్టర్​ యూజర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

డెస్క్​టాప్ యూజర్లకు మొబైల్​ అనుభూతిని ఇచ్చేందుకు తీసుకువచ్చిన అప్​డేట్​లో హెడ్డర్​ ఎడమ వైపు ఉండే ప్రొఫైల్ పిక్చర్​ ఆప్షన్ తొలగించింది ట్విట్టర్​. వీటితో పాటు బుక్ మార్క్​లు, ఎక్స్​ప్లోర్​, మెసేజ్​ ఆప్షన్లను హెడ్డర్​​ నుంచి ఎడమై వైపునకు మార్చింది.

ఈ మార్పుపై ఖాతాదారులు... ట్విట్టర్ డెస్క్​టాప్ యూజర్లకు అవసరం లేని మార్పులు చేసిందని అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మీమ్​లు, జిఫ్​లతో ట్విట్టర్​ డిజైన్​ టీమ్​పై సెటైర్లు వేస్తున్నారు.

"ఈ కొత్త డిజైన్​ ఎవరికీ అవసరముండదు. డిజైనింగ్ టీమ్​ ఎలా ఆలోచిస్తోందో అర్థమవ్వడం లేదు. ఎందుకంటే ఈ డిజైన్​ డెస్క్​టాప్ యూజర్లకు అంతగా అవసరం లేదు. ట్విట్టర్ డెస్క్​టాప్​ వెర్షన్​ను మొబైల్ యాప్​గా మార్పులు చేసింది. కానీ ఇది మొబైల్ కాదు."
-ట్విట్టర్ వినియోగదారుడు​

అయితే ఈ తాజా అప్​డేట్​లో ట్విట్టర్ డార్క్ మోడ్​నూ తీసుకువచ్చింది. దీనిపై మాత్రం యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: మీ పిల్లలకు ఆర్థిక భరోసా ఇవ్వండిలా..

Intro:Body:

v

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.