కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా ప్రైవేటు సంస్థలు వేగంగా స్పందించి ప్రజలు, ప్రభుత్వాలకు అండగా నిలుస్తున్నాయి. తమ వంతుగా సాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. అయితే వీటిల్లో కొన్ని సంస్థలు స్పందిస్తున్న తీరు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆయా సంస్థలు స్పందించిన తీరుపై లింక్డ్ఇన్, ట్విట్టర్‌లు రెండు వేరువేరు జాబితా రూపొందించాయి. ఈ రెండింటిలోనూ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్‌లు చోటు దక్కించుకున్నాయి.
లింక్డ్‌ఇన్ జాబితాలో...
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంధన సంస్థ రిలయన్స్ తొలి హెల్త్‌సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ద లింక్డ్‌ఇన్ పేర్కొంది. కరోనా బాధితులకు చికిత్స కోసం ముంబయిలోని సెవెన్‌హిల్స్‌లో సంస్థకు చెందిన 100 పడకల ఆస్పత్రిని కేటాయించినట్లు వివరించింది.
లింక్డ్‌ఇన్ జాబితాలో మాస్క్‌ల తయారీకి గాను డెక్తలాన్‌ను(స్పోర్టింగ్ గూడ్స్ తయారీ సంస్థ), శానిటైజర్ల తయారీకి గాను ఎల్ ఓరియల్ వంటి సంస్థలకు చోటు కల్పించింది. అంతేకాకుండా జాబితాలో ఎల్‌ఈజీఓ, జీఈ హెల్త్‌కేర్ ఇంజనీరింగ్ సంస్థలు కూడా ఉన్నాయి.
ట్విట్టర్ ఏమందంటే..
ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలతో బ్రాండ్లు ఎలా కలిసిపోయాయో తెలుసా? అంటూ ట్విట్టర్ ఓ జాబితా రూపొందించింది. ఇందులో సమాచారాన్ని అందిస్తూ గూగుల్.. హ్యాండ్ శానిటైజర్లు తయారు చేస్తూ బీవరేజి సంస్థ డియాజియో.. భౌతిక దూరాన్ని ప్రచారం చేస్తూ ది హిందూ వంటి కంపెనీలు ప్రజలతో కలిసిపోయాయని పేర్కొంది. ఉచిత వెబినార్ అందించి సిస్కో, స్వీయ శుభ్రతను తెలియజేసిన డెటాల్ కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలిపింది.
కరోనా వైరస్ లాంటి విపత్కర పరిస్థితుల్లో రూ.500 కోట్లు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇవ్వడం వంటి చర్యలకు గానూ రిలయన్స్‌ను ఈ జాబితాలో చేర్చింది ట్విట్టర్.
ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, లిక్డ్‌ఇన్, బిగ్ బజార్, జొమాటో, తాజ్ హోటళ్లు, ఉబెర్, ఒప్పో ఇండియా, నెట్‌ఫ్లిక్స్, డురెక్స్, టిండర్, మెర్సిడేజ్ బెంజ్‌లూ ఉన్నాయి.
ఇదీ చూడండి:కేంద్రం యూటర్న్- ఆన్లైన్లో ఇక అవి కొనలేం!