ETV Bharat / business

చాలా మంది మమ్మల్ని నమ్మట్లేదని తెలుసు: ట్విట్టర్​ సీఈఓ

తమను (సోషల్ మీడియాను) చాలా మంది విశ్వసించడం లేదనే విషయం తమకు తెలుసని ట్విట్టర్​ సీఈఓ జాక్​ డోర్సె వెల్లడించారు. అయితే ఇది తమకు మాత్రమే పరిమితం కాలేదని తెలిపారు. సోషల్ మీడియా, ఓటీటీలకు కేంద్రం నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చిన మరుసటి రోజే డోర్సే ఈ విధంగా స్పందించడం గమనార్హం.

Twitter on Center godliness for Social media
నూతన మార్గదర్శకాలపై ట్విట్టర్ స్పందన
author img

By

Published : Feb 26, 2021, 3:20 PM IST

Updated : Feb 26, 2021, 3:28 PM IST

సామాజిక మాధ్యమాలు 'తీవ్ర విశ్వసనీయత సమస్య'ను ఎదుర్కొంటున్నట్లు మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​ పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ కంటెంట్​ నియంత్రణ పద్ధతులను మరింత పారదర్శకంగా మార్చాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. యూజర్లకు మరింత నియంత్రణ ఇచ్చేందుకూ ప్రయత్నిస్తున్నట్లు తెలపింది.

"చాలా మంది మమ్మల్ని (సోషల్​ మీడియాను) నమ్మరు అనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా.. ఇటీవల ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే మాకు మాత్రమే ఇది పరిమితం కాలేదు. ప్రతీ సంస్థ విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటోంది."

-జాక్​ డోర్సే, ట్విట్టర్​ సీఈఓ

పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత, అవకాశాల వంటి వాటిపై దృష్టి సారించడం వల్ల ప్రయోజనం ఉంటుందని డోర్సే అభిప్రాయపడ్డారు.

సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్టవేసేందుకు కేంద్రం గురువారం నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో ట్విట్టర్​ ఈ విధంగా స్పందించింది.

ఇదీ చదవండి:భారత్​ మార్గదర్శకాలపై వాట్సప్‌.. ఏం చేసేనో?

Last Updated : Feb 26, 2021, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.