ETV Bharat / business

ప్రపంచ నాయకులు, సామాన్యులకు ట్విట్టర్​ సేమ్​ రూల్​!

ఇటీవల తలెత్తిన వివాదాలకు మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ తమ పాలసీల్లో మార్పులతో చెక్​ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ముఖ్యంగా ప్రపంచ నాయకులపై చర్యల విషయంలో ప్రజా స్పందన తమకు బాగా ఉపయోగపడుతుందని ట్విట్టర్​ వెల్లడించింది.

Twitter changing its policies
ట్విట్టర్ పాలసీల్లో మార్పు
author img

By

Published : Mar 19, 2021, 6:18 PM IST

Updated : Mar 19, 2021, 7:04 PM IST

సామాజిక మాధ్యమాలపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ వార్తలు, విద్వేషం, రెచ్చగొట్టే, వివాదాస్పద సమాచారాన్ని అడ్డుకోలేకపోతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రముఖులపై చర్యల విషయంలోనూ సామాజిక మాధ్యమ సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ చెక్​ పెట్టేందుకు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజా నాయకులు, ఇతర ప్రముఖులకు కూడా సాధారణ యూజర్లలానే నిబంధనలు ఉండాలా? ఒకవేళ వారు నిబంధనలను అతిక్రమిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే విషయాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు వెల్లడించింది.

ప్రజాభిప్రాయసేకరణ శుక్రవారం ప్రారంభమై.. ఏప్రిల్ 12న ముగియనున్నట్లు తెలిపింది ట్విట్టర్​. ఈ సర్వే తమ నిబంధనల్లో మార్పునకు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొంది. సర్వేకు సంబంధించిన ప్రశ్నలు.. హిందీ, ఇంగ్లీష్​, చైనీస్​, ఉర్దూ సహా మొత్తం 14 భాషల్లో ఉంచినట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల నిపుణులు, పౌర సమాజ సంఘాలు, విద్యావేత్తలతోనూ ఈ విషయంపై చర్చలు జరుపుతున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. పాలసీల మార్పులో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని వివరించింది.

ఇదీ చదవండి:వాట్సాప్​ను అడ్డుకోండి: కోర్టుకు కేంద్రం వినతి

Last Updated : Mar 19, 2021, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.