ETV Bharat / business

సెల్​ఫోన్లు 30 సెకన్లు ట్రింగ్ ట్రింగ్ అనాల్సిందే..! - బిజినెస్​ వార్తలు తెలుగు

టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్​టెల్, వొడాఫోన్-​ఐడియా మధ్య తలెత్తిన రింగ్​టైం వివాదానికి ట్రాయ్ ముగింపు పలికింది. ఏ నెట్​వర్క్​ యూజర్లయనా.. ఏ నెట్​వర్క్​కు కాల్​ చేసినా మొబైల్​ ఫోన్లకు 30 సెకన్లు.. ల్యాండ్​లైన్​లకు 60 సెకన్లు రింగ్​టైమ్​ను కేటాయించాల్సిందేనని స్పష్టం చేసింది.​

రింగ్​టైం వివాదం
author img

By

Published : Nov 1, 2019, 7:46 PM IST

దేశంలోని ప్రధాన టెల్కోల మధ్య తలెత్తిన రింగ్ టైం వివాదంపై టెలికాం నియంత్రణ 'ట్రాయ్' కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్​కు 30 సెకన్లు, ల్యాండ్​లైన్​కు 60 సెకన్ల ప్రామాణిక రింగ్​టైంను నిర్దేశిస్తూ నిర్ణయం తీసుకుంది. కాల్ రిసీవ్​ చేసుకునే వ్యక్తి.. ఫోన్​కు సమాధానం ఇవ్వకున్నా.. తిరస్కరించకున్నా.. ప్రామాణిక సమయం వరకు ఫోన్​ మోగాల్సిందేనని ట్రాయ్​ స్పష్టం చేసింది. ఈ ప్రామాణిక రింగింగ్ సమయాలు దేశీయంగా చేసే కాల్స్​​కు మాత్రమే వర్తిస్తాయని ట్రాయ్ పేర్కొంది.

రింగ్​టైం వివాదం ఏంటంటే..?

దేశంలోని ప్రధాన టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా తమ వినియోగదారులు.. ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై రింగింగ్​ సమయాన్ని 25 సెకన్లకు తగ్గిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్​ జియో తమ నెట్​వర్క్​కు వచ్చే కాల్స్​పై రింగ్​టైమ్​ను 25 సెకన్లకు తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ రెండు సంస్థలు పేర్కొన్నాయి.

జియో మాత్రం తొలుత ఆయా సంస్థలే నిబంధనలు ఉల్లంగించాయని.. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ట్రాయ్​కు ఫిర్యాదు చేశాయి.

రింగ్​టైం తగ్గిస్తే లాభమెవరికి..?

రెండు వేరువేరు నెట్​వర్క్​ల మధ్య ఫోన్​కాల్స్​ మాట్లాడాలంటే కాల్​ చేసిన నెట్​వర్క్​.. కాల్​ రిసీవ్​ చేసుకున్న నెట్​వర్క్​కు​ ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీ(ఐయూసీ) చెల్లించాల్సి ఉంటుంది. రింగింగ్ సమయాన్ని తగ్గిస్తే.. వినియోగదారుడు ఆన్సర్​ చేసేలోపే కాల్​ కట్​ అవుతుంది. అప్పుడు వేరే నెట్​వర్క్​ నుంచి కాల్స్ వచ్చేలా చేసుకోవచ్చని టెలికాం సంస్థలు భావించాయి.

టెలికాం సంస్థల మధ్య తలెత్తిన ఈ వివాదానికి తెరదించేందుకు.. ట్రాయ్​ ప్రామాణిక రింగింగ్ సమయాన్ని తెరపైకి తెచ్చింది.

ఇదీ చూడండి: విమానాల ఇంజిన్లు మారిస్తేనే ఇండి'గో'కు అనుమతి

AP Video Delivery Log - 1200 GMT News
Friday, 1 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1159: UK Brexit Party Farage AP Clients Only 4237764
UK's Farage offers Johnson a deal if Brexit plan dropped
AP-APTN-1156: Iraq Friday Prayers AP Clients Only 4237762
Iraq's Shiite leaders warn against civil strife
AP-APTN-1117: SKorea Helicopter Part No Access SKorea 4237757
Search for survivors after SKorea helicopter crash
AP-APTN-1114: Lebanon Bank Protest AP Clients Only 4237750
Protesters storm banking association in Lebanon
AP-APTN-1110: India Germany 3 AP Clients Only 4237756
India, Germany agree to boost industrial cooperation
AP-APTN-1052: Iraq Protests AP Clients Only 4237753
Iraqis continue to protest in holy city of Najaf
AP-APTN-1046: US IL Trick or Treater Shot 2 Must credit ABC 7 Chicago, No access Chicago, No use US broadcast networks, No re-sale, re-use or archive 4237752
Chicago police: Trick-or-treater shooting 'unacceptable'
AP-APTN-1009: Turkey Syria AP Clients Only 4237746
Russian and Turkish military vehicles seen inside Syria
AP-APTN-1003: China MOFA Briefing AP Clients Only 4237744
DAILY MOFA BRIEFING
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.