ETV Bharat / business

జియో​లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు

రిలయన్స్ జియో ఫ్లాట్​ఫాం​లో మరో అంతర్జాతీయ సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన ప్రత్యామ్నాయ ఆస్తుల నిర్వహణ సంస్థ- టీపీజీ రూ.4,546 కోట్లతో 0.93 శాతం వాటాను దక్కించుకుంది. ఎల్​ కేటర్​టన్ రూ. 1894.50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ప్రకటించింది. ఇది మొత్తం వాటాల్లో 0.39 శాతం.

JIO-TPG
జియో
author img

By

Published : Jun 14, 2020, 5:16 AM IST

Updated : Jun 14, 2020, 6:51 AM IST

రిలయన్స్​ జియోలోకి అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రత్యామ్నాయ ఆస్తుల సంస్థ- టీపీజీ.. జియోలో రూ.4,546.80 కోట్లతో 0.93 శాతం వాటాను కొనుగోలు చేసింది.

ఫలితంగా జియో ఫ్లాట్​ఫాం ఆకర్షించిన నిధుల మొత్తం రూ.1.02 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఫేస్​బుక్​, సిల్వర్​ లేక్​, విస్టా ఈక్విటీ పార్ట్​నర్స్​, జనరల్​ అట్లాంటిక్​, కేకేఆర్, ముబాడలా, ఆడియా, టీపీజీలు మొత్తం 22 శాతం జియో వాటాలను దక్కించుకున్నాయి. ఎల్​ కేటర్​టన్ రూ. 1894.50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జియో ప్రకటించింది. ఇది మొత్తం వాటాల్లో 0.39 శాతం.

ఫేస్​బుక్​తో ప్రారంభం..

జియోలో ఏప్రిల్​ 22న ఫేస్​బుక్​ 9.99 శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే సిల్వర్ లేక్​ 1.15 శాతం వాటాలను స్వీకరించింది. తర్వాత విస్టా ఈక్విటీ 2.32 శాతం, జనరల్ అట్లాంటిక్​ 1.34 శాతం, కేకేఆర్​ 2.32 శాతం కొనుగోలు చేశాయి.

టీపీజీ నేపథ్యం..

టీపీజీ అంతర్జాతీయ ప్రత్యామ్నాయ ఆస్తుల నిర్వహణ సంస్థ. దీనిని 1992లో స్థాపించారు. ఈ కంపెనీ 79 బిలియన్​ డాలర్ల ఆస్తుల నిర్వహణ చేపడుతోంది. 25 ఏళ్ల చరిత్ర కలిగిన టీపీజీ.. రిలయన్స్​లో వాటా కొనుగోలు చేయటంపై ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు.

"టీపీజీ పెట్టుబడులకు సంతోషంగా స్వాగతం పలుకుతున్నాం. డిజిటల్ సాంకేతికత వ్యాపారాల్లో టీపీజీ ట్రాక్​ రికార్డు చాలా బాగుంది. కోట్లాది వినియోగదారులు, చిన్న వ్యాపారాలకు సేవలు అందిస్తోంది టీపీజీ."

- ముకేశ్ అంబానీ

Last Updated : Jun 14, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.