భారత్‌లో టిక్‌టాక్, హలోల నిషేధం తర్వాత వాటి మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారీ నష్టాన్ని మూటగట్టుకోనున్నట్లు తెలుస్తోంది. చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం భారత్‌లో నిషేధం తర్వాత బైట్‌డాన్స్ 6 బిలియన్ డాలర్లు (రూ.45 వేల కోట్లు) నష్టపోవచ్చని తెలిసింది.
చైనా యాప్‌లపై నిషేధం..
గల్వాన్ లోయలో చైనా బలగాలు.. భారత సైనికులపై దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణంతో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై కేంద్రం సోమవారం నిషేధం విధించింది.