ETV Bharat / business

ఫుల్ సెక్యూరిటీ, స్పెషల్ డాక్టర్.. అంబానీ మనవడు స్కూల్​కెళ్తే మామూలుగా ఉండదు! - శ్లోకా మెహతా

Mukesh Ambani's Grandson: ప్రిన్స్​ ఆఫ్​ ఇండియా.. వ్యాపార దిగ్గజం ముకేశ్​ అంబానీ మనవడికి ఆయన కుటుంబ సన్నిహితులు పెట్టుకున్న నిక్​నేమ్ ఇది. పేరుకు తగ్గట్టే సాగుతోంది పృథ్వీ అంబానీ జీవితం. ఫస్ట్​ బర్త్​డే పార్టీ తారలతో కళకళలాడి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ 'ప్రిన్స్​' ప్లేస్కూల్​కు వెళ్లే టైమ్ వచ్చింది. మరి పృథ్వీ ఏ పాఠశాలకు వెళ్తున్నాడు? అక్కడ ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి?

The baby bling life of Mukesh Ambani's Grandson

author img

By

Published : Mar 22, 2022, 5:59 PM IST

Mukesh Ambani Grandson: ముకేశ్​ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉంటారు. ఫోర్బ్స్​ లెక్కల ప్రకారం.. ఆయన సంపద విలువ 97.4 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్​కు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలతో పాటు అంబానీ కుటుంబ వ్యక్తిగత జీవిత విశేషాలనూ తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ విషయం. అదే.. బుల్లి అంబానీ 'ప్లేస్కూల్​ కహానీ'.

The baby bling life of Mukesh Ambani's Grandson,
పృథ్వీ అంబానీ

అమ్మ, నాన్న వెళ్లిన స్కూల్​కే..

ముకేశ్​ అంబానీ కుమారుడు ఆకాశ్​కు శ్లోకా మెహతాతో వివాహమైంది. 2020 డిసెంబర్​ 10న వారికి పృథ్వీ పుట్టాడు. ఏడాదిన్నర వయసుకే పృథ్వీని ప్లేస్కూల్​కు పంపుతున్నారు ఆకాశ్​- శ్లోక. ఈ నెలలోనే అతడ్ని ముంబయి మలబర్ హిల్​లోని సన్​ఫ్లవర్​ నర్సరీ స్కూల్​లో చేర్చారు. ఆకాశ్​, శ్లోక అదే స్కూల్​లో తమ విద్యాభ్యాసం ప్రారంభించడం విశేషం.

ఆకాశ్​ అంబానీ- శ్లోకా మెహతా

ముంబయిలో 27 అంతస్తుల విలాసవంతమైన నివాసంలో ఉండే అంబానీ కుటుంబానికి పనివారికి కొదవ లేదు. అయినా.. పృథ్వీ ఆలనాపాలనను ఆయాలకు వదిలేయకుండా, తామే స్వయంగా చూసుకుంటున్నారట ఆకాశ్-శ్లోక. తమ కుమారుడు పెద్దగా స్పాట్​లైట్​లో లేకుండా, సాదాసీదా జీవితం గడిపేలా చూడాలన్నదే వారి ఆలోచన అని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

పృథ్వీని నర్సరీ స్కూల్​కు తీసుకెళ్తున్న శ్లోకా మెహతా

అయితే.. అంబానీ వారసుడు కాబట్టి పృథ్వీకి ఎక్కడకు వెళ్లినా గట్టి బందోబస్తు ఉండాల్సిందే. అందుకే అతడి కోసం పాఠశాలలోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయించారు. కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే.. పృథ్వీ వెన్నంటే 24X7 ఓ వైద్యుడు ఉండేలా చూస్తున్నారు.

అందరితో సమానంగా..

అంబానీ మనవడు అయినప్పటికీ.. పృథ్వీని అందరు విద్యార్థులతో సమానంగా చూస్తున్నట్లు చెప్పింది సన్​ఫ్లవర్​ నర్సరీ స్కూల్ యాజమాన్యం. ఆ పాఠశాల వెబ్​సైట్ ప్రకారం.. అతి కొద్ది సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పిల్లల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకుని, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ విద్యాబోధన చేస్తారు. కళలు, యోగా వంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారిస్తారు.

పృథ్వీ అంబానీతో వ్యాపార దిగ్గజం ముకేశ్​ అంబానీ

ధూమ్​ధామ్​గా ఫస్ట్​ బర్త్​డే పార్టీ

గతేడాది డిసెంబర్ 10న పృథ్వీ అంబానీ తొలి పుట్టినరోజు గుజరాత్​ జామ్​నగర్​లో అట్టహాసంగా సాగింది. అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, రుచికరమైన వంటలు చేసిపెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి షెఫ్​లు, ప్రఖ్యాత సింగర్ అరిజిత్ సింగ్ లైవ్​ పెర్ఫామెన్స్​తో.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు రణ్​బీర్​ కపూర్, ఆలియా భట్, రణ్​వీర్ సింగ్, సచిన్ తెందూల్కర్, జహీర్​ ఖాన్​ వంటి 120 మంది ప్రముఖులు హాజరయ్యారు. గెస్ట్​ల విషయంలో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేసింది అంబానీ కుటుంబం. అతిథులంతా ఐదు రోజులు ముందే జామ్​నగర్​ చేరుకుని, గెస్ట్​ హౌస్​లలో క్వారంటైన్​లో ఉండేలా చూసింది.

ఇవీ చూడండి: 300 ఎకరాల్లో అంబానీ ఇల్లు- రెండో నివాసంగా మారబోతోందా?

ఈశా అంబానీకి కీలక పదవి- అంతర్జాతీయ స్థాయిలో...

వాల్టన్​ బాటలో ముకేశ్​ అంబానీ.. ఆస్తులన్నీ 'ట్రస్ట్'​ పరిధిలోకి!

త్వరలోనే రిలయన్స్​లో పగ్గాల మార్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.