ETV Bharat / business

ఏజీఆర్​ బకాయిల్లో 10% చెల్లించేందుకు గడువు ఫిక్స్​! - ఏజీఆర్​ బకాయిలు

సవరించిన స్థూల ఆదాయ బకాయిల్లో 10 శాతాన్ని.. 2021, మార్చి 31లోపు టెలికాం సంస్థలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాయి ప్రభుత్వ వర్గాలు. గతంలో చేసిన మధ్యంతర చెల్లింపులకు ఇది సంబంధం లేదని పేర్కొంది ప్రభుత్వం. ఈ బకాయిలు సుమారు రూ.12,921 కోట్ల మేర ఉంటాయని అంచనా.

AGR dues
'మార్చి 31లోపు 10 శాతం ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందే'
author img

By

Published : Sep 21, 2020, 9:23 PM IST

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం బకాయిల్లో 10శాతం.. 2021 మార్చి 31 నాటికి టెలికాం సంస్థలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో చేసిన మధ్యంతర చెల్లింపులకు సంబంధం లేకుండా.. మొత్తం బకాయిల్లోని 10 శాతం కట్టాలని పేర్కొన్నాయి. టెలికాం సంస్థలు మార్చి 31లోపు చెల్లించే బకాయిలు రూ.12,921 కోట్ల మేర ఉంటాయని అంచనా. ఇది ఇప్పటికే వొడాఫోన్​-ఐడియా (రూ.7,854 కోట్లు), ఎయిర్​టెల్​ (రూ.18,004 కోట్లు) చెల్లించిన దానికి 80 శాతం మేర ఉంటుంది.

సవరించిన స్థూల ఆదాయ బకాయిలు(ఏజీఆర్​) పెండింగ్‌లో ఉన్న భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా సహా మిగతా ఆపరేటర్లు ఈ ఆదేశాలను పాటించాల్సిందేనని సంబంధిత వర్గాలు తేల్చి చెప్పాయి. మిగతా బకాయిలను వచ్చే ఏడాది నుంచి పదేళ్లలో వాయిదా ప్రకారం చెల్లించవచ్చని టెలికాం శాఖ తెలిపింది.

వొడాఫోన్-ఐడియా రూ.5,825 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ రూ. 4,398 కోట్లు, బీఎస్​ఎన్​ఎల్​ రూ. 583 కోట్లు, ఎంటీఎన్​ఎల్​ రూ.435 కోట్లు బకాయిలను 2021 మార్చి 31 నాటికి చెల్లించాల్సి ఉంది. కేవలం రిలయన్స్‌ జియో మాత్రమే పూర్తి చెల్లింపులు చేసింది. కాగా టెలికం సంస్థలన్నీ కలిపి ప్రభుత్వానికి లక్షా 47 వేల కోట్ల మేర బకాయి పడ్డాయి.

ఇదీ చూడండి:ఏజీఆర్ బకాయిలు చెల్లించండి.. కష్టాల్లో ఉన్నాం ప్లీజ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.