ETV Bharat / business

టాటా మోటార్స్‌ రూ.28,900 కోట్ల పెట్టుబడులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యాపారాలపై రూ.28,900 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. హైడ్రోజన్‌ ఇంధన వాహనాల అభివృద్ధిపై సంస్థ దృష్టిసారించనుందని తెలిపారు. విద్యుత్ వాహన విక్రయాలు 25 శాతానికి చేరతాయని అంచనా వేశారు.

tata motors
టాటా మోటార్స్
author img

By

Published : Jul 31, 2021, 6:27 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌), దేశీయ వ్యాపారాలపై టాటా మోటార్స్‌ రూ.28,900 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. '2020-21లోరూ.19,800 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఈ ఏడాదికి రూ.28,900 కోట్లని అనుకుంటున్నాం. ఇందులో జేఎల్‌ఆర్‌కు 2.5 బిలియన్‌ పౌండ్లు, టాటా మోటార్స్‌కు రూ.3000-3500 కోట్లు ఉండొచ్చ'ని తెలిపారు.

'హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ వాహనాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నాం. 15 వాహనాల కోసం ఇండియన్‌ ఆయిల్‌ నుంచి తొలి ఆర్డరు సైతం పొందాం. అందులో ఏడింటిని సిద్ధం చేశామ'ని వివరించారు. 'విద్యుత్‌ వాహనాల(ఈవీ) వ్యాపారానికి కంపెనీ విడిగా మూలధనాన్ని సమీకరిస్తుంది. మధ్య నుంచి దీర్ఘకాలంలో ఈవీల విక్రయాలు ప్రస్తుత 2 శాతం నుంచి 25 శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నామ'ని దృశ్యశ్రవణ మాధ్యమంలో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశాన్ని(ఏజీఎమ్‌) ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.

'2025కు ముందే కనీసం 10 ఈవీలను ప్రవేశపెడతాం.. అందుకే తగిన సమయం చూసి ఈవీ విభాగానికి మూలధనాన్ని సమీకరిస్తాం. వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక ఈవీ ప్లాట్‌ఫాంను త్వరలో కంపెనీ ఆవిష్కరించనుంద'న్నారు. అందుబాటు ధర ఈవీలపై టాటా మోటార్స్‌ పనిచేస్తోందని చెప్పారు. టిగోర్‌ ఈవీ మరింత అధికశ్రేణిలో రానుందని పేర్కొన్నారు.

బ్యాటరీకి ప్రత్యేక వ్యాపారం

ఈవీ విడిభాగాల వ్యాపారాలకు సంబంధించి కంపెనీ ప్రణాళికలపై మాట్లాడుతూ 'ఇందులో అవకాశాలను పరిశీలిస్తున్నాం. టాటామోటార్స్‌కు వెలుపల, విడిగా బ్యాటరీ వ్యాపారం ఏర్పాటు చేయాలనీ చూస్తున్నాం. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లను కనీసం 25 నగరాలకు విస్తరిస్తాం. కనీసం 1000 ఛార్జింగ్‌ స్టేషన్లు రాబోయే సంవత్సరాలలో వస్తాయి' అని చంద్రశేఖరన్‌ వివరించారు.

చిప్‌సెట్‌ల కొరతను ఎదుర్కొనేందుకు, ప్రత్యామ్నాయ యత్నాలు చేస్తున్నామని, నేరుగా సెమీకండక్టర్‌ తయారీదార్లతో కలిసి పనిచేయడమూ ఒక మార్గమని తెలిపారు. భారత్‌లో నివసించేందుకు వీలుకానందునే, టాటా మోటార్స్‌కు ఎండీగా ప్రకటించిన మార్క్‌ లిస్టోసెలా బాధ్యతలు స్వీకరించలేదన్నారు.

ఇదీ చదవండి: మైక్రోమ్యాక్స్​ కొత్త బడ్జెట్​ ఫోన్​, ఇయర్​బడ్స్​.. ఫీచర్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.