ETV Bharat / business

​​​​​​ధరల పెంపు బాటలో వాహన తయారీ సంస్థలు

వాహన తయారీ సంస్థలు ఒక్కొక్కటిగా ధరల పెంచగా.. తాజాగా టాటా మోటార్స్‌, ఇసుజు, బీఎండబ్ల్యూ కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి తన కమర్షియల్‌ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది.

Tata motors to increase commercial vehicle prices from January
​​​​​​ధరల పెంపు బాటలో వాహన సంస్థలు
author img

By

Published : Dec 22, 2020, 5:33 AM IST

వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, హోండా కార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫోర్డ్‌ ఇండియా వంటి కార్ల తయారీ కంపెనీలతో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్‌ సైతం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్‌, ఇసుజు, బీఎండబ్ల్యూ సైతం ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి.

వచ్చే నెల 1వ తేదీ నుంచి తన కమర్షియల్‌ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు, ఇతర కారణాల వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడానికి తోడు బీఎస్‌-6 ప్రమాణాలకు మారాల్సి రావడంతో ఈ పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొంది. బీఎండబ్ల్యూ సైతం అన్ని రకాల వాహనాలపై జనవరి 4 నుంచి ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. బీఎండబ్ల్యూ, మినీ వాహనాలపై 2 శాతం మేర ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఇసుజు సైతం తన పికప్‌ వాహనాలపై జనవరి 1 నుంచి దాదాపు రూ.10 వేల మేర పెంచనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చూడండి: 'కరోనా దెబ్బకు 47శాతం పడిపోయిన ఇళ్ల అమ్మకాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.