Tata Car Price Hike: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్ వాహనాల ధరలను 0.9 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు జనవరి 19న అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. జనవరి 18కి ముందు ఆర్డర్లకు ఈ పెంపు వర్తించదని పేర్కొంది.
కమొడిటీలు, ముడి పదార్థాల ధరలు పెరిగినందువల్ల కంపెనీపై అదనపు భారం పడుతోందని, ఫలితంగా ధరలు పెంచాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపింది.
ముంబయికి చెందిన ఈ కార్ల తయారీ సంస్థ టియాగో, పంచ్, హారియర్ వంటి మోడళ్లను దేశీయ విపణిలో విక్రయిస్తుంది.
''2022 జనవరి 19న పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. వేరియంట్లు, మోడళ్లను బట్టి ఈ ధరల పెంపు ఉంటుంది.''
- టాటా మోటార్స్
ఇదే సమయంలో టాటా మోటార్స్ తమ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. కొన్ని వేరియంట్లకు ప్రత్యేక ఆఫర్ కింద రూ. 10 వేల తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
Maruti Suzuki Hikes Vehicle Prices: 3 రోజుల కింద.. దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కూడా కార్ల ధరలను పెంచింది. ప్రస్తుత మోడల్స్‌పై 4.3శాతం వరకు ధరలను పెంచినట్లు పేర్కొంది.
మారుతీ సుజుకీ ఇండియా(ఎమ్ఎస్ఐ) ఆల్టో నుంచి ఎస్- క్రాస్ రేంజ్ కార్లను విక్రయిస్తుంది. వీటి ధరలు రూ.3.15లక్షల నుంచి రూ.12.56లక్షల వరకు ఉంటుంది.
ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టీల్, అల్యూమినియం, కాపర్, ప్లాస్టిక్, ఇతర విలువైన లోహాల ధరలు పెరుగుతున్న కారణంగానే.. ధరల పెంపు అనివార్యం అవుతోందని కొద్ది రోజులుగా ఆటోమొబైల్ కంపెనీలు చెబుతున్నాయి. మిగతా సంస్థలు కూటా టాటా, మారుతీ బాటలో పయనించనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయ్.. వివరాలివే