టెలికాం శాఖకు వొడాఫోన్-ఐడియా, టాటా టెలీ సర్వీసెస్ ఏజీఆర్ బకాయిలు పాక్షికంగా చెల్లించినట్లు సమాచారం. వొడాఫోన్ రూ.2,500 కోట్లు, టాటా రూ.2,190 కోట్లు ప్రభుత్వానికి జమ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కోర్టు తిరస్కరించినా..
అయితే బకాయిలను పాక్షికంగా చెల్లిస్తామని వొడాఫోన్ అభ్యర్థించగా ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ వొడాఫోన్ రూ.2,500 కోట్లే చెల్లించింది.
ఏజీఆర్ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్యలు తీసుకుంటామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏజీఆర్ బకాయిలకు సంబంధించి రూ.10వేల కోట్లను ఈ రోజు ఉదయమే ఎయిర్టెల్ చెల్లించింది. మిగిలిన మొత్తం సుప్రీం తదుపరి విచారణలోగా జమ చేస్తామని స్పష్టం చేసింది.