ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ దాదాపు రూ.9,345 కోట్ల నిధులను సమీకరించింది. సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ 2, ప్రొసస్ల ద్వారా ఈ నిధులను సేకరించినట్లు తెలిపింది. ఈ నిధులతో స్విగ్గీ విలువ దాదాపు రూ.41,125 కోట్లకు చేరింది.
స్విగ్గీ ప్రత్యర్థి సంస్థ జొమాటో కూడా ఇటీవల ఐపీఓకు వచ్చి భారీగా నిధులను సమీకరించింది. దీనితో ఆ కంపెనీ విలువ దాదాపు రూ.64,365 కోట్లకు పెరిగింది.
ఇదీ చదవండి:అదరగొట్టిన జొమాటో.. ఐపీఓకు భారీ స్పందన