హెచ్-1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నిరాశ వ్యక్తం చేశారు. వలసదారుల వల్లే అగ్రరాజ్యం ఈ స్థాయిలో ఉందని ట్వీట్ చేశారు.
-
Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all.
— Sundar Pichai (@sundarpichai) June 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all.
— Sundar Pichai (@sundarpichai) June 22, 2020Immigration has contributed immensely to America’s economic success, making it a global leader in tech, and also Google the company it is today. Disappointed by today’s proclamation - we’ll continue to stand with immigrants and work to expand opportunity for all.
— Sundar Pichai (@sundarpichai) June 22, 2020
"అమెరికా ఆర్థిక వ్యవస్థ విజయంలో ఇమిగ్రేషన్ కీలక పాత్ర పోషించింది. ఇమిగ్రేషన్ వల్లే సాంకేతిక రంగంలో అమెరికా ప్రపంచస్థాయికి ఎదిగింది. గూగుల్ కంపెనీ కూడా ఈ స్థాయిలో ఉండటానికి కారణం అదే. ట్రంప్ నిర్ణయంతో నిరాశ చెందా. వలసదారులకు అండగా ఉంటాం. అందరికీ అవకాశం లభించేలా చూస్తాం."
-- సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. లీడర్షిప్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ అండ్ హ్యుమ్ రైట్స్ (ఎల్సీసీహెచ్) సీఈఓ వనితా గుప్తా.. అధ్యక్షుడి నిర్ణయంపై మండిపడ్డారు.
"తాజా నిర్ణయంతో ట్రంప్ మరోసారి జాతి వివక్ష వైఖరిని ప్రదర్శించారు. అయితే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధ్యక్షుడు చేపట్టే చర్యలు పనిచేయవు. వలసదారులకు ఆయన చేసిన అన్యాయాన్ని కోర్టులు అడ్డుకుంటాయి."
--- వనితా గుప్తా, ఎల్సీసీహెచ్ సీఈఓ.
అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో తాత్కాలికంగా పని చేయడానికి ఈ వీసా ఉపయోగపడుతుంది. కరోనా సంక్షోభం కారణంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అమెరికన్లకు అవకాశాలు కల్పించాలనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.