స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఆర్బీఐ రెపో ప్రకటనకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండగా స్వల్ప లాభాలకు పరిమితమైంది.
ఆర్బీఐ మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం నేటితో ముగియనుంది. మధ్యాహ్నం రెపో రేటు మార్పుపై నిర్ణయం వెలువడనుంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 47 పాయింట్లు పుంజుకుంది. ప్రస్తుతం 37,024 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 10,954 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టాటా స్టీల్, ఎం&ఎం, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, వేదాంత, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: సులభంగా ఐటీఆర్ దాఖలు చేయండిలా..