ETV Bharat / business

మార్కెట్లకు కరోనా భయాలు-కుదేలవుతున్న సూచీలు

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. కరోనా భయాలతో అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు మదుపరులు. సెన్సెక్స్ 285 పాయింట్ల నష్టంతో 40 వేల మార్క్​ దిగువకు చేరింది. నిఫ్టీ 94 పాయింట్ల క్షీణతతో కొనసాగుతోంది.

STOCK MARKETS NEWS
స్టాక్ మార్కెట్ వార్తలు
author img

By

Published : Feb 26, 2020, 9:31 AM IST

Updated : Mar 2, 2020, 2:51 PM IST

కరోనా భయాలతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెవీ వెయిట్​ షేర్లన్నీ ప్రతికూలంగా కొనసాగుతుండటం నేటి నష్టాలకు మరో కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 285 పాయింట్లకు పైగా నష్టంతో ప్రస్తుతం 39,995 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 94 పాయింట్ల క్షీణతతో 11,703 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

30 షేర్ల ఇండెక్స్​లో ఏషియన్​ పెయింట్స్, హెచ్​యూఎల్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​ షేర్లు మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, భారతీఎయిర్​టెల్​, ఇండస్ఇండ్​ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

రూపాయి, ముడి చమురు

రూపాయి నేడు 11 పైసలు పెరిగి.. డాలర్​ మారకం విలువ 71.74 వద్ద కొనసాగుతోంది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ 0.50 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ముడి చమురు ధర 54.53 డాలర్లుగా ఉంది.

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లయిన చైనా, దక్షిణ కొరియా, హాంగ్​కాంగ్​, జపాన్​ సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: మార్కెట్లపై వారెన్ బఫెట్ ఏమన్నారంటే?

Last Updated : Mar 2, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.