భారీ నష్టాల నుంచి తేరుకుని నేడు లాభాలతో ట్రేడవుతున్నాయి స్టాక్ మార్కెట్లు. హెవీ వెయిట్ షేర్లయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సానుకూలంగా స్పందించి.. లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 189 పాయింట్లకు పైగా వృద్ధితో.. ప్రస్తుతం 41,450 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్లకు పైగా లాభంతో..12,199 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..
భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ, సన్‌ఫార్మా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే స్వల్పంగా తగ్గి.. రూ.71.18 వద్ద కొనసాగుతోంది.