స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వృద్ధికి ఊతమందించే దిశగా కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలతో గత సెషన్లో భారీ లాభాలు నమోదయ్యాయి. వీటికి తోడు కేంద్రానికి భారీగా నిధులు బదిలీ చేసేందుకు ఆర్బీఐ అంగీకరించింది. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రోత్సాహకాలు ఉండొచ్చని మార్కెట్ వర్గాల్లో అంచనాలు పెరిగాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 121 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 37, 615 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,100 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
టాటా మోటార్స్, ఎస్బీఐ, ఎల్&డీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇదీ చూడండి: విమానాల్లో ఈ 'యాపిల్' ల్యాప్‌టాప్‌లపై నిషేధం