ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ(ఐయూసీ)లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీలు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన.. ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియాలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చే అంశమని టెలికాం నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం ఉన్న 6 పైసల ఐయూసీ ఛార్జీలే 2020 డిసెంబర్ వరకు కొనసాగుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. 6 పైసల ఐయూసీ.. 2017 అక్టోబర్ 1 నుంచి కొనసాగుతోంది. అంతకు ముందు ఇది 14 పైసలుగా ఉండటం గమనార్హం.
తాజా గడువు ముగిసిన తర్వాత 2021 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీలు పూర్తిగా రద్దవుతాయని ట్రాయ్ వెల్లడించింది.
ఏంటీ ఐయూసీ..!
రెండు వేరు వేరు నెట్‌వర్క్‌ల మధ్య ఫోన్‌కాల్స్ మాట్లాడాలంటే కాల్ చేసిన నెట్వర్క్.. కాల్ రిసీవ్ చేసుకున్న నెట్‌వర్క్‌కు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ(ఐయూసీ) అంటారు.
ఇదీ చూడండి:పీపీఎఫ్ నిబంధనల్లో కీలక మార్పులు