స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు నేడు అడ్డుకట్ట పడింది. కరోనా ప్రభావం దృష్ట్యా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 2020లో ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించింది. ఈ అంశం మదుపరుల అప్రమత్తతకు కారణమైంది. వీటికి తోడు జనవరిలోనూ దేశ రిటైల్ ద్రవ్యోల్బణం పెరగటం, డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి తగ్గడం వంటి అంశాలు నేటి నష్టాలకు కారణమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 106 పాయింట్ల నష్టంతో 41,460 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి.. 12,175 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,709 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,338 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,226 పాయింట్ల అత్యధిక స్థాయి, 12,140 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
టైటాన్ 2.37 శాతం, ఎస్బీఐ 2.33 శాతం, ఇన్ఫోసిస్ 1.45 శాతం, సన్‌ఫార్మా 1.12 శాతం, టీసీఎస్ 0.97 శాతం లాభాలను గడించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ 3.68 శాతం, టాటా స్టీల్ 1.57 శాతం, ఐసీఐసీ బ్యాంక్ 1.51 శాతం, కోటక్ బ్యాంక్ 1.47 శాతం, హెచ్డీఎఫ్సీ 1.37 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి
రూపాయి నేడు ప్లాట్‌గా ముగిసింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం రూ.71.33 వద్ద ఉంది.
చమురు
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ నేడు ఏకంగా 2 శాతం మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 55.25 డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి:ఫేస్బుక్లో జోరుగా 'నకిలీ' దందా- 27.5కోట్ల ఖాతాలు ఫేక్