స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. మెజారిటీ షేర్లు సానుకూలంగా కొనసాగుతున్న నేపథ్యంలో సూచీలు భారీ లాభాల దిశగా పరుగుతీస్తున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 261 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 41,228 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 86 పాయింట్లకు పైగా వృద్ధితో 12,142 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
30 షేర్ల ఇండెక్స్‌లో దాదాపు అన్ని కంపెనీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎం&ఎం, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
టీసీఎస్, హెచ్డీఎఫ్సీ షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి.