స్టాక్ మార్కెట్లు నేడు తిరిగి లాభాలతో ముగిశాయి. చాలా రోజులుగా కొనసాగతున్న వాణిజ్య యుద్ధానికి అమెరికా-చైనా ముగింపు పలికాయి. ఎట్టకేలకు తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి ఇరు దేశాలు. ఈ పరిణామం అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచింది. ఫలితంగా స్టాక్ మార్కెట్లు నిన్నటి నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. కోటక్ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు నేటి లాభాలకు దన్నుగా నిలిచాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 60 పాయింట్లు పెరిగి 41,933 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 12,355 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 42,059 పాయింట్ల గరిష్ఠాన్ని (జీవనకాల గరిష్ఠం) తాకగా.. 41,812 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,389 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం).. 12,312 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
నెస్లే ఇండియా 3.23 శాతం, కోటక్ బ్యాంక్ 1.38 శాతం, హెచ్యూఎల్ 1.36 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.34 శాతం, రిలయన్స్ 0.90 శాతం, టీసీఎస్ 0.69 శాతం లాభాలను ఆర్జించాయి.
ఎన్టీపీసీ 1.94 శాతం, హీరో మోటోకార్ప్ 1.70 శాతం, టాటా స్టీల్ 1.54 శాతం, టెక్ మహీంద్రా 1.48 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.19 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.99 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి:'ఆన్-ఆఫ్'తో డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితం!