ETV Bharat / business

'ఓటీటీల నియంత్రణ' పిటిషన్లపై సుప్రీం స్టే - ఓటీటీల నియంత్రణ పిటిషన్​ లేటెస్ట్ న్యూస్

ఓటీటీల నియంత్రణకు సంబంధించి వివిధ హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇదే అంశానికి సంబంధించి కొత్తగా దాఖలైన పిటిషన్లనూ విచారించొద్దని ఆదేశించింది. హోలీ తర్వాత దీనిపై విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.

Supreme court stay on OTT regulate pleas in HCs
ఓటీటీల నియంత్రణపై సుప్రీం విచారణ
author img

By

Published : Mar 23, 2021, 10:14 PM IST

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో ఓటీటీ (ఓవర్​ ది టాప్​) ప్లాట్​ఫామ్​ల నియంత్రణకు సంబంధించి పెండింగ్​లో ఉన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల బదిలీపై గతంలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ పంజాబ్‌, హరియాణా కోర్టుల్లో కేసుల విచారణ కొనసాగుతోందని జస్టిస్ డి.వై.చంద్రచూద్​ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఈ అంశానికి సంబంధించి కొత్త పిటిషన్లు కూడా వివిధ హైకోర్టుల్లో దాఖలైనట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు వివరించారు. అయితే వాటి విచారణ కూడా నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హోలీ తర్వాత ఈ విషయంపై విచారణ జరుపుతామని వెల్లడించింది.

ఇదీ చదవండి:బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్‌ కహానీ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.