ETV Bharat / business

సుప్రీం తలంటు - డీఓటీ ఉత్తర్వు ఉపసంహరణ

author img

By

Published : Feb 14, 2020, 4:30 PM IST

Updated : Mar 1, 2020, 8:22 AM IST

ఏజీఆర్ బకాయిలు చెల్లించకపోతే టెల్కోలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇచ్చిన ఉత్తర్వును టెలికాం శాఖ వెనక్కుతీసుకుంది. డీఓటీ ఆదేశాలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన కాసేపటికే ఈ నిర్ణయం తీసుకుంది టెలికాం శాఖ.

sc, dot
సుప్రీం

టెల్కోలు ఏజీఆర్​ బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించే విషయంలో టెలికాం శాఖ (డీఓటీ) నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. టెల్కోలపై బలవంతపు చర్యలు తీసుకోరాదనే ఆదేశాలను ఇవాళ ఉపసంహరించుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

టెలికాం సంస్థలు, ఇతరులు ఏజీఆర్​ బకాయిలు చెల్లించకపోయినా వారిని బలవంతపెట్టవద్దని డీఓటీ డెస్క్ అధికారి... ఆటార్నీ జనరల్​, ఇతర రాజ్యాంగ అధికారులకు లేఖ రాశారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది డీఓటీ.

సుప్రీం ఆగ్రహం..

తమ తీర్పుపై డీఓటీ డెస్క్​ స్టే విధించడాన్ని ఉదయం తప్పుబట్టింది న్యాయస్థానం. బకాయిల విషయంలో టెల్కోలు కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా గడువులోపు టెలికాం విభాగానికి చెల్లించకపోవటాన్ని తీవ్రంగా పరిగణించింది.

దీన్ని కోర్టు ధిక్కరణగా ఎందుకు పరిగణించకూడదో తెలిపాలని.. భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియా, టాటా టెలీ సర్వీసెస్​కు సమన్లు జారీ చేసింది. "ఈ దేశంలో న్యాయం ఉందా? ఇలాంటివి చూస్తూ ఇక్కడ ఉండటం కన్నా దేశం విడిచిపోవటం మంచిది" అని వ్యాఖ్యానించింది సుప్రీం.

జనవరి 23 వరకే గడువు

టెలికాం విభాగానికి ఏజీఆర్​ బకాయిలను 2020 జనవరి 23లోపు టెల్కోలు చెల్లించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

కంపెనీల వారీగా బాకాయిలు ఇలా..

  • ఎయిర్​టెల్ రూ.21,682.13 కోట్లు
  • వొడాఫోన్-ఐడియా రూ.19,823.71 కోట్లు
  • ఆర్​కాం రూ.16,456.47 కోట్లు
  • బీఎస్​ఎన్​ఎల్​ రూ.2,098.72 కోట్లు
  • ఎంటీఎన్​ఎల్​ రూ.2,537.48 కోట్లు

ఇదీ చూడండి: దేశంలో న్యాయముందా?: టెల్కోలపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు

Last Updated : Mar 1, 2020, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.