ETV Bharat / business

ఫ్యూచర్​ రిటైల్​, బియానీకి సుప్రీం నోటీసులు - అమెజాన్​ వాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ

ఫ్యూచర్​ రిటైల్​-అమెజాన్​ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అమెజాన్​ వాదనపై స్పందించాలని ఫ్యూచర్​ రిటైల్​, కిశోర్​ బియానీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. ఐదు వారాల తర్వాత మరోసారి ఈ అంశంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

SC notice to FRL on Amazon plea
ఫ్యూచర్ గ్రూప్​కు సుప్రీం నోటీసులు
author img

By

Published : Feb 22, 2021, 1:28 PM IST

ఫ్యూచర్​ రిటైల్​ సహా సంస్థ ఛైర్పర్సన్​ కిశోర్​ బియానీకి​ సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. అమెజాన్​ వ్యాజ్యంపై స్పందన తెలపాలని జస్టిస్ ఆర్​ఎఫ్ నారీమన్​ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

ఎందుకు నోటీసులు?

రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఒప్పందంపై యథాపూర్వ స్థితి కొనసాగించాలంటూ అంతకుముందు ఇచ్చిన ఆదేశాలపై దిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన అనంతరం అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. అమెజాన్​ వ్యాజ్యంపై స్పందించాలని ఫ్యూచర్​ రిటైల్ సహా సంస్థ ఛైర్​పర్సన్​కు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై స్పందించేందుకు మూడు వారాలు, అమెజాన్​ అప్పీలుపై సమాధానిచ్చేందుకు మరో రెండు వారాల గడువు ఇచ్చింది. మొత్తం ఐదు వారాల తర్వాత అమెజాన్​ వ్యాజ్యంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది సుప్రీం కోర్టు.

ఇదీ చదవండి:కిశోర్‌ బియానీపై ఏడాది పాటు నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.