ETV Bharat / business

ఏడాది కనిష్ఠానికి ఎస్​బీఐ వడ్డీ రేట్లు - గృహరుణలు చౌక

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ 15 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గించింది. అన్ని రకాల రుణాలపై తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్టు 10 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఎస్​బీఐ
author img

By

Published : Aug 7, 2019, 3:49 PM IST

అన్ని రకాల రుణాలపై 15 బేసిస్​ పాయింట్లు వడ్డీ తగ్గించింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ. రెపో రేటు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. ఎస్​బీఐ వడ్డీ కోత విధించింది. తగ్గిన వడ్డీ రేట్లు ఆగస్టు 10 నుంచి అమలు కానున్నాయి.

ఈ సవరణతో ఎస్​బీఐ మార్జినల్​ కాస్ట్ ఆధారిత వడ్డీ రేటు(ఎంసీఎల్​ఆర్).. ఏడాది కనిష్ఠం వద్ద 8.25 శాతానికి చేరింది.

తాజా రేట్ల కోతతో.. ఏప్రిల్ 1 నుంచి ఎస్​బీఐలో గృహ రుణాలు తీసుకున్న వినియోగదారులకు 35 బేసిస్​ పాయింట్ల మేర వడ్డీ భారం తగ్గనుంది. ఈ ఏడాది జూలై నుంచి రెపో అధారిత గృహ రుణాలనూ ఎస్​బీఐ అందిస్తోంది.

ఇదీ చూడండి: దసరా తర్వాత కశ్మీర్‌కు పెట్టుబడుల వరద!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.