అన్ని రగాల రుణాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ. తగ్గిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 10 నుంచి అమలవుతాయని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
సవరించిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండిగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)లతో 8.55 శాతానికి వడ్డీ రేటు తగ్గనుంది. ప్రస్తుతం ఎంసీఎల్ఆర్ 8.55 శాతంగా ఉంది.
వీటితో పాటు రూ.30 లక్షల లోపు గృహ రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు 8.60 నుంచి 8.90 శాతం మధ్య ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీ రేట్లు 8.70 నుంచి 9.0 శాతం మధ్య ఉన్నాయి.
ఇటీవలి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది రిజర్వు బ్యాంకు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది.