ఆన్లైన్లో జరిగే మోసపూరిత లావాదేవీలను నివారించేందుకు 'భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)' సరికొత్త వర్చువల్ కార్డ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పరిమితితో కూడిన డెబిట్ కార్డ్ లాగా పని చేస్తుంది. ఈ-కామర్స్ వెబ్సైట్లలో వీసా కార్డులలానే ఈ వర్చువల్ డెబిట్ కార్డును వినియోగించుకునే వీలుంది.
వర్చువల్ కార్ట్‌లో మరిన్ని ఫీచర్లు..
- ఎస్బీఐ వర్చువల్ కార్డు, మర్చంట్ వద్ద ప్రైమరీ కార్డు, ఖాతా వివరాలు గోప్యంగా ఉంచుతుంది. ఇది మోసాల బారిన పడకుండా నియంత్రిస్తుంది.
- వర్చువల్ కార్డు లావాదేవీలు పూర్తయ్యే వరకు.. 48 గంటల పాటు పని చేస్తుంది.
- ఓటీపీ ద్వారా వర్చువల్ కార్డును క్రియేట్ చేసుకోవచ్చు.
- కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.50,000 పరిమితి వరకు ఎస్బీఐ వర్చువల్ కార్డు క్రియేట్ చేసుకునే వీలుంది.
- వీసా కార్డులను అనుమతించే ఏ ఆన్లైన్ వెబ్సైట్లలోనైనా ఈ వర్చువల్ కార్డును వినియోగించుకోవచ్చు.
- ఇది సింగిల్ యూజ్ కార్డు అంటే ఒక సారి వినియోగించిన తర్వాత మళ్లీ పనిచేయదు.
ఎలా క్రియేట్ చేసుకోవాలి..
- ముందు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి
- అందులో ఈ కార్ట్‌ను ఎంచుకోవాలి.. ఆ తర్వాత జెనరేట్ వర్చువల్ కార్డ్‌ను క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఏ ఖాతా నుంచి, ఎంత మొత్తంలో నగదు పంపించాలో వంటి ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత నిబంధనలన్నీంటిని అంగీకరించి.. అప్పుడు జెనరేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అపుడు కార్డుదారుని పేరు, డెబిట్ కార్డు ఖాతా సంఖ్య, వర్చువల్ కార్డ్ పరిమితివంటి వాటిని ధ్రువీకరించాలి.
- అప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఎస్బీఐ నుంచి ఓటీపీ వస్తుంది.
- ఓటీపీ ఇచ్చి కన్ఫార్మ్‌పై క్లిక్ చేస్తే.. అప్పుడు మీకు వర్చువల్ కార్డు నంబర్, ఎక్స్పైరీ తేదీ వంటివి కనిపిస్తాయి.
- ఈ నంబర్‌ను ఆన్లైన్ షాపింగ్ కోసం వినియోగించుకోవచ్చు.
ఇదీ చూడండి:టాటాసన్స్- మిస్త్రీ కేసు: ఎన్సీఎల్ఏటీ తీర్పుపై సుప్రీం స్టే