ETV Bharat / business

గృహ రుణాలపై స్టేట్​ బ్యాంక్​ వడ్డీ రాయితీ - ఎస్​బీఐ లేటెస్ట్ న్యూస్

గృహ రుణాలపై భారీగా వడ్డీ రాయితీని ప్రకటించింది బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ. వినియోగదారులు.. సిబిల్ స్కోరు ఆధారంగా, యోనో యాప్​ ద్వారా 25 బేసిస్ పాయింట్ల వరకు గృహ రుణంపై వడ్డీ రాయితీని పొందొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Sbi home loan offer
ఎస్​బీఐ గృహ రుణాలపై భారీగా పడ్డీ రాయితీ
author img

By

Published : Oct 21, 2020, 1:47 PM IST

Updated : Oct 21, 2020, 2:27 PM IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్​బీఐ) గృహ రుణాలపై వడ్డీ రాయితీ ఆఫర్​ ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో గృహ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు రాయితీ ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడించింది.

ఎస్​బీఐ వడ్డీ రాయితీ వివరాలు..

రూ.75 లక్షలకుపైగా గృహరుణం తీసుకున్న వారికి 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుంది. అయితే రుణగ్రహీత సిబిల్ స్కోరు ఆధారంగా, యోనో యాప్​ ద్వారా దరఖాస్తు చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ప్రస్తుతం రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు గృహ రుణాలపై.. క్రెడిట్ స్కోరు ఆధారంగా 10 బేసిస్ పాయింట్ల వరకు ఇస్తున్న వడ్డీ రాయితీని పండుగ సీజన్​ నేపథ్యంలో 20 బేసిస్ పాయింట్లకు పెంచింది ఎస్​బీఐ.

తాజా ఆఫర్​తో.. రూ.3 కోట్ల వరకు గృహ రుణంపై ఇదే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. 8 మెట్రో నగరాల్లో ఈ సదుపాయం వినియోగించుకునే వీలుంది. యోనో యాప్​ ద్వారా గృహ రుణానికి దరఖాస్తు చేసే వారికి 5 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రాయితీ లభిస్తుంది.

ఎస్​బీఐ ప్రస్తుతం రూ.30 లక్షల వరకు గృహ రుణాలకు 6.90 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. రూ.30 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే 7 శాతం వడ్డీ విధిస్తోంది.

ఇదీ చూడండి:జర్మనీ జీడీపీని దాటిన చైనా కుబేరుల సంపద

గృహ రుణాలపై స్టేట్​ బ్యాంక్​ వడ్డీ రాయితీ

Last Updated : Oct 21, 2020, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.