అపోలో ఆస్పత్రుల సంయుక్త ఎండీ సంగీత రెడ్డికి మరో కీలక పదవీ దక్కింది. 2019-20 వరకు పరిశ్రమల సమాఖ్య 'ఫిక్కీ' అధ్యక్షురాలిగా ఆమె పనిచేయనున్నారు.
హెచ్ఎస్ఐఎల్ ఉపాధ్యక్షుడు, ఎండీ సందీప్ సోమణి స్థానంలో ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.
"ఫిక్కీకి, దేశానికి భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇటీవల ముగిసిన ఫిక్కీ 92వ సర్వ సభ్య సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చే దిశగా సమాలోచనలు జరిపాం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేస్తున్నారు.." - సంగీత రెడ్డి
ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు, స్టార్ & డిస్నీ ఇండియా ఛైర్మన్ ఉదయ్ శంకర్ ఫిక్కీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. హెచ్యూఎల్ ఛైర్మన్, ఎండీ సంజీవ్ మోహతా ఫిక్కీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఇదీ చూడండి:సిబ్బంది కొరతతో 18 గోఎయిర్ విమానాలు రద్దు