స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాంసంగ్ మడత ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రకటించినట్లుగానే.. సరికొత్త ఫీచర్లతో గెలాక్సీ ఫోల్డ్‌ను ఆవిష్కరించింది శాంసంగ్.
12 జీబీ ర్యామ్.. 512 జీబీ స్టోరేజి సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధరను భారత్‌లో రూ.1,64,999గా నిర్ణయించింది శాంసంగ్.
శాంసంగ్ మడతఫోన్ల ప్రీబుకింగ్స్ అక్టోబర్ 4 నుంచి చేసుకోవచ్చు. అక్టోబర్ 20 నుంచి షిప్పింగ్‌లు ప్రారంభం కానున్నాయి.
గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు..
- మడతబెట్టినప్పుడు 4.6 అంగుళాల డిస్ప్లే
- మడత తీస్తే..7.3 అంగుళాల భారీ డిస్ప్లే
- ఆక్టాకోర్ ప్రాసెసర్
- 16ఎంపీ+12ఎంపీ+12ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు
- 10 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్
- 4380 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
ఇదీ చూడండి: వడ్డీ రేట్లు మరోసారి తగ్గడం ఖాయమా...?