ETV Bharat / business

క్యూ1లో శాంసంగ్​కు భారీ లాభాలు - టీవీల విక్రయం ద్వారా శాంసంగ్ ఆదాయం

ఈ ఏడాది తొలి మూడు నెలల్లో తమ స్మార్ట్​ఫోన్లు, టీవీల విక్రయాలు భారీగా పెరిగినట్లు ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ వెల్లడించింది. తొలి త్రైమాసికంలో 8.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని గడించినట్లు తెలిపింది.

Samsung Q1 results
శాంసంగ్ క్యూ1 ఫలితాలు
author img

By

Published : Apr 29, 2021, 7:16 PM IST

దక్షిణ కొరియాకు చెందిన టెక్​ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్​ ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 8.5 బిలియన్ డాలర్ల నిర్వహణ లాభాన్ని గడించిననట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ మొత్తం 46 శాతం అధికమని తెలిపింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 59 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో స్మార్ట్​ఫోన్లు, టీవీల విక్రయాల్లో వృద్ధి లాభాల పెరుగుదలకు కారణంగా తెలిపింది. ఈ ఏడాది యూఈఎఫ్​ఏ యూరో 2020 సాకర్​, టోక్యో సమ్మర్ ఒలింపిక్స్ వంటి స్పొర్ట్స్ ఈవెంట్ల వల్ల టీవీలకు డిమాండ్ భారీగా పెరిగినట్లు శాంసంగ్​ పేర్కొంది. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తుండటం కొంత అస్థిరతకు కారణమవుతున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి:బిగ్​బాస్కెట్​ స్వాధీనానికి టాటాకు లైన్ క్లియర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.