శాంసంగ్ త్వరలో గెలాక్సీ ఎస్ సిరీస్‌లో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది. కొద్ది రోజుల క్రితం ఎస్ సిరీస్‌లో గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. వాటికి కొనసాగింపుగా గెలాక్సీ ఎస్ 21 లేదా గెలాక్సీ ఎస్ 30 పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేయనుందని వన్‌లీక్ వాయిస్ అనే సంస్థ తెలిపింది. ప్లస్, అల్ట్రా అనే రెండు వేరియంట్లలో పంచ్ హోల్ డిస్‌ప్లే, స్లిమ్ డిజైన్‌తో ఈ ఫోన్లను తీసుకొస్తున్నారట. ఈ రెండు వేరియంట్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తాయని సమాచారం.
ప్లస్ వేరియంట్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారట. వెనక వైపు వర్టికల్ డిజైన్‌తో మూడు కెమెరాలు, ముందు సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. 6.2 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఇస్తున్నారట. అలాగే, అల్ట్రా వేరియంట్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందు ఒక సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. 6.7 అంగుళాలు లేదా 6.9 అంగుళాల కర్వ్ డిస్‌ప్లే ఇస్తారని తెలుస్తోంది. గ్రే, పింక్, సిల్వర్, వయోలెట్, వైట్ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయని సమాచారం. అయితే ఇప్పటివరకు విడుదల చేసిన గెలాక్సీ ఎస్ సిరీస్ ఫోన్లు ఎస్ పెన్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి. కానీ ఈ ఫోన్లలో ఎస్ పెన్ కోసం ఎలాంటి స్లాట్ ఇవ్వకపోవడంతో ఎస్ పెన్ ఫీచర్ ఉండకపోవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: కొత్త వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జర్‌ను సిద్ధం చేసిన షావోమి