ETV Bharat / business

క్యూ2లో శాంసంగ్ లాభం 23 శాతం వృద్ధి!

కరోనా సంక్షోభంలోనూ దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారీ లాభాలను ఆర్జించొచ్చని తెలుస్తోంది. ఏప్రిల్-జూన్​ మధ్య సంస్థ ఆపరేటింగ్ లాభం 23 శాతం పెరగొచ్చని శాంసంగ్ అంచనాల్లో ప్రకటించింది. కంప్యూటర్ చిప్​సెట్లకు డిమాండ్ పెరగటం ఇందుకు కారణంగా వెల్లడించింది.

author img

By

Published : Jul 7, 2020, 12:30 PM IST

SAMSUNG PROFITS
శాంసంగ్ లాభాలు

ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) తమ సంస్థ ఆపరేటింగ్ లాభం 23 శాతం పెరగొచ్చని ఎలక్ట్రానిక్ ఉపకరణాల దిగ్గజం శాంసంగ్ ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్​లలో వాడే చిప్​ సెట్లకు డిమాండ్ భారీగా పెరగటం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. గత త్రైమాసికానికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలను ఈ నెలాఖరున ప్రకటించనుంది శాంసంగ్.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం వంటివి ఇవ్వడం, విద్యార్థులు ఆన్​లైన్​ క్లాస్​లు వింటుండటం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు, ల్యాప్​టాప్​లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ అవకాశాలను శాంసంగ్ సరిగ్గా అందిపుచ్చుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఏప్రిల్-జూన్ త్రైమాసిక అంచనాలు ఇలా..

ఈ ఏడాది ఏప్రిల్ జూన్​ మధ్య ఆపరేటింగ్ లాభం 6.8 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది శాంసంగ్. అయితే ఆదాయం మాత్రం 7 శాతం తగ్గి.. 43.6 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చని తెలిపింది.

ఇదే సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆపరేటింగ్ ప్రాఫిట్​లో 3.4 శాతం వృద్ధి నమోదు చేసింది శాంసంగ్. టీవీలు, స్మార్ట్​ఫోన్లు, సహా ఇతర ఉత్పత్తుల విక్రయాలు భారీగా పడిపోవడం కారణంగా రెండో త్రైమాసికంలో లాభాలు భారీగా తగ్గుతాయని అంచనా వేయడం గమనార్హం.

ఇదీ చూడండి:ఆర్డరిస్తే ఇంటికే మాంసం డెలివరీ.. ఈ-స్టార్టప్‌లకు పెరిగిన గిరాకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.