భారత్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ప్రకటించింది శామ్సంగ్ ఇండియా. మొత్తం 1,200 మంది ఇంజినీరింగ్ పట్టభద్రులను కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. సంస్థ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కేంద్రాల్లో పని చేసేందుకు.. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్సీ నుంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోనున్నట్లు పేర్కొంది.
బెంగళూరు, నోయిడా, దిల్లీల్లో ఉన్న శామ్సంగ్ సంస్థ.. ఆర్డీ కేంద్రాల్లో వీరు పనిచేయనున్నారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆన్డివైజ్ ఏఐ, నెట్వర్క్ సహా పలు ఇతర సాంకేతికతలపై కొత్త ఉద్యోగులు పని చేయాల్సి ఉంటుంది.
2020 నాటికి మొత్తం 2,500 మందిని ఉద్యోగాల్లోకి చేర్చుకోనున్నట్లు శామ్సంగ్ గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే 2017, 2018ల్లో 1,000 మందిని చేర్చుకోగా.. తాజాగా మరో 1200 మందిని ఉద్యోగావాశాలు కల్పించనుంది.
ఇదీ చూడండి:'ప్రైవేటీకరణ లేకపోతే.. ఎయిర్ఇండియాకు బై బై'