ETV Bharat / business

గూగుల్ డీల్, గ్లాస్, 5జీ... రిలయన్స్ ఏజీఎం హైలైట్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్.. వరుస పెట్టుబడులు, కీలక భాగస్వామ్యాలతో దేశంలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ఈ నేపథ్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన సంస్థ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మరిన్ని కీలక అభివృద్ధి ప్రణాళికలు ఆవిష్కరించింది. వాటన్నింటి విశేషాలు వివరంగా మీ కోసం.

reliance agm
రిలయన్స్ భవిష్యత్ ప్రణాళికలు ఇవే
author img

By

Published : Jul 15, 2020, 6:23 PM IST

డిజిటల్ ఇండియా కల సాకారంలో తన వంతు పాత్ర పోషించేలా మరిన్ని కీలక ప్రణాళికలు సిద్ధం చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. కరోనా కారణంగా తొలిసారి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన 43వ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయా వివరాలను వాటాదారులకు వివరించారు సంస్థ అధిపతి ముకేశ్ అంబానీ. కరోనా సంక్షోభం సవాళ్లతో పాటు అవకాశాలనూ తెచ్చిందని, వాటిని అందిపుచ్చకునేలా రిలయన్స్ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

జియోలో గూగుల్ పెట్టుబడులు, గ్లాస్ పేరిట సరికొత్త సాంకేతికత అభివృద్ధి, 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై కీలక విషయాలు వెల్లడించారు ముకేశ్. ఆ వివరాలు సంక్షిప్తంగా....

పెట్టుబడులు..

జియోలో 7.7 శాతం వాటా కొనుగోలుకు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ సిద్ధమైంది. ఇందుకోసం రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

గూగుల్​తో ఒప్పందంతో కలిపి ఇప్పటి వరకు జియో ప్లాట్​ఫామ్స్​కు వచ్చిన పెట్టుబడుల విలువ రూ.1,52,055.45 కోట్లు.

జియోలో ఇప్పటి వరకు విక్రయించిన వాటా 32.84 శాతం.

మూడు నెలల కన్నా తక్కువ సమయంలో జియోలో వాటా విక్రయం, రైట్స్ ఇష్యూ (రూ.53,124 కోట్లు), పెట్రో కెమికల్ వ్యాపారాల్లో బ్రిటీష్​ పెట్రోలియం పెట్టుబడి (రూ.7,629 కోట్లు) ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రూ.2,12,809 కోట్లు సమీకరించుకుంది.

గూగుల్​తో ఒప్పందంతో పెట్టుబడుల సమీకరణ ప్రక్రియ సమాప్తం.

అప్పులు లేని అతిపెద్ద సంస్థ..

జియో పెట్టుబడులు, రైట్స్​ ఇష్యూ, చమురు వ్యాపారాల వాటా విక్రయం ద్వారా సమీకరించుకున్న నిధులతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు లేని సంస్థగా మారింది.

సంస్థ అప్పులు 2019-20 చివరి నాటికి రూ.1,61,035 కోట్లుగా ఉన్నాయి. రిలయన్స్ సమీకరించుకున్న నిధులు అంతకన్నా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.

అప్పులు లేని సంస్థగా మారడం వల్ల టెలికాం, రిటైల్, చమురు వ్యాపారాలు వేగంగా వృద్ధి చెందేందుకు వీలు ఏర్పడినట్లు ముకేశ్ అంబానీ తెలుపారు.

గత ఏడాది రిలయన్స్ వ్యాపారాల్లో 20 శాతం వాటాను అతిపెద్ద చమురు సంస్థ సౌదీ ఆరామ్​కోకు విక్రయించాలని భావించింది రిలయన్స్. అయితే ఇటీవల భారీగా పతనమైన చమురు ధరలు, కరోనా సంక్షోభం వల్ల ఒప్పందం ఆలస్యమైంది. ఈ ఒప్పందంపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు ముకేశ్ వెల్లడించారు.

రిటైల్ వ్యాపారాలు..

రిలయన్స్ రిటైల్​ స్టోర్లు మూడింట రెండొతులు టైర్​2, టైర్​3 పట్టణాల్లోనే ఉన్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. రిటైల్​ స్టోర్లలో విక్రయించే కూరగాయలు 80 శాతం వరకు రైతుల వద్దే నేరుగా కొంటున్నట్లు వెల్లడించారు.

లక్ష మంది చిరువ్యాపారులతో అనుబంధమే తమ అభివృద్ధి వ్యూహమని ముకేశ్​ అన్నారు.

5జీ సేవలు వచ్చే ఏడాది..

దేశీయంగా 5జీ సేవలు అందించేందుకు టెక్నాలజీని సొంతంగా రూపొందిస్తోంది జియో.

5జీ స్పెక్ట్రమ్​ అందుబాటులోకి రాగానే.. ట్రయల్ నిర్వహించనుంది.

వచ్చే ఏడాది ఎప్పుడైనా జియో 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 'ఆత్మ నిర్భర్​ భారత్​' పిలుపులో భాగంగా 5జీ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది జియో.

దేశంలో డేడా వినియోగం భారీగా పెరిగింది. గత నెలలోనే 500 కోట్ల జీబీ డేటాను వాడిన జియో వినియోగదారులు.

జియో బ్రాడ్​ బ్యాండ్​ ద్వారా 10 లక్షల ఇళ్లకుపైగా కనెక్షన్​లు ఇచ్చామని ముకేశ్ అంబానీ తెలిపారు.

జియో టీవీ+, జియో గ్లాస్, జియో మీట్

ఓటీటీ సేవల సంస్థలు నెట్​ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్​స్టార్​ వంటి వాటి సేవలు జియో టీవీ+లో ఓకే దగ్గర అందుబాటులోకి రానున్నాయి. వాయిస్​ సెర్చ్​ ద్వారా ఈ యాప్​ను ఆపరేట్​ చేసే సదుపాయం ఉంది.

జూమ్​కు పోటీగా తీసుకువచ్చిన జియో మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ యాప్​ను 50 లక్షల మందికి పైగా డౌన్​లోడ్ చేసుకున్నారు.

ఈ సారి కొత్తగా జియోగ్లాస్‌ను ఆవిష్కరించింది జియో. ఈ స్మార్ట్‌ కళ్లద్దాల బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. దీనిలో 25 రకాల యాప్స్‌ అందుబాటులో ఉంటాయి. ఇది మిక్స్‌డ్ వర్చువల్ రియాలటీ సేవలను అందిస్తుంది. దీనికి కేబుల్‌ కూడా కనెక్ట్‌ చేసుకోవచ్చు.

ఈ కొత్త ఆవిష్కరణల విశేషాలను ముకేశ్​ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్​ అంబానీ వివరించారు.

జియో మార్ట్

జియో మార్ట్​ సేవలు దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో అందుబాటులోకి వచ్చాయి. రోజుకు 2.5 లక్షల ఆర్డర్లు డెలవరీ చేస్తోంది జియో మార్ట్.

మరిన్ని..

  • డెన్​ నెట్​వర్క్, హాత్​వే కేబుల్​... నెట్​వర్క్ 18లో విలీనమయ్యాయి. దీనికి నియంత్రణపరమైన అనుమతులు లభించాల్సి ఉంది.
  • మూలధన సమీకరణ ప్రణాళికలు పూర్తయ్యాయి. ఇకపై వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి పెట్టనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు.
  • గూగుల్​తో కలిసి 5జీ, 4జీ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది జియో.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్​ నుంచి పెట్రో కెమికల్ వ్యాపారాన్ని అనుబంధ సంస్థగా మార్చేదుకు ప్రయత్నిస్తోంది. దీనిపై నియంత్రణ సమస్యలను అధిగమించేందుకు ఎన్​సీఎల్​ఏటీని సంప్రదించనుంది సంస్థ.

ఇవీ చూడండి:

'వాట్సాప్​, జియోమార్ట్​ కలయికతో విప్లవాత్మక మార్పులు'

జియో 5జీ సేవలు వచ్చే ఏడాది ప్రారంభం!

రిలయన్స్, గూగుల్ డీల్​ ఫిక్స్- జియోలో 7.7% వాటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.