ETV Bharat / business

రిలయన్స్​ హవా- 'ఫార్చూన్‌ 500' లో అగ్రస్థానం - sbi news

రిలయన్స్​ ఇండస్ట్రీస్ మరోసారి సత్తా చాటింది. భారత్​లో ఫార్చూన్​-500 కంపెనీల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ నిలిచింది.​

RIL tops Fortune 500 list of Indian companies, IOC at second spot
ఆర్​ఐఎల్​ హవా! ఆ జాబితాలో టాప్​ ప్లేస్​
author img

By

Published : Dec 3, 2020, 5:09 AM IST

ఫార్చూన్‌ 500 భారత కంపెనీల జాబితాలో ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అగ్రస్థానాన్ని పొందింది. బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ), ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌లు ఆ తర్వాతి స్థానాలను (2, 3, 4, 5) పొందడం విశేషం.

టాటా మోటార్స్‌(6), రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌(7), టీసీఎస్‌(8), ఐసీఐసీఐ బ్యాంక్‌(9), ఎల్‌ అండ్‌ టీ(10)లు టాప్‌-10లో చోటు దక్కించుకున్నాయి. ఆగస్టులో విడుదలైన ఫార్చూన్‌ అంతర్జాతీయ ర్యాంకుల్లో ఆర్‌ఐఎల్‌ తొలిసారిగా టాప్‌-100 కంపెనీల్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఫార్చూన్‌ ఇండియా ఈ జాబితాను ప్రచురించింది.

ఇదీ చూడండి:మార్కెట్​లోకి నిస్సాన్​ కొత్త కారు... ఆకట్టుకుంటున్న ఫీచర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.