2021 మార్చి నాటికి కంపెనీ రుణరహితంగా మారుస్తామన్న ముకేశ్ అంబానీ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. రిలయన్స్‌కు చెందిన చమురు, రసాయనాల వ్యాపారాల్లో 25 శాతం వాటాను సౌదీకి చెందిన 'అరామ్కో' సంస్థకు విక్రయించనున్నట్లు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం జరిగిన సంస్థ సర్వ సభ్య సమావేశంలో ఈ ప్రకటన చేశారు ముకేశ్.
ఈ ఒప్పందం ద్వారా సమకూరే నిధులను రిలయన్స్‌ను అప్పులులేని సంస్థగా మార్చేందుకు వినియోగించనున్నట్లు వెల్లడించారాయన. వచ్చే నెల నుంచి జియో ఫైబర్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ సానుకూలతల నేపథ్యంలో రిలయన్స్ షేర్ల కొనుగోలుకు మొగ్గు చూపారు మదుపరులు.
బీఎస్ఈలో రిలయన్స్ షేరు 9.72 శాతం లాభపడింది. షేరు ధర రూ.1,275కి చేరింది. ఎన్ఎస్ఈలోనూ సంస్థ షేరు 9.74 శాతం బలపడింది. షేరు ధర రూ. 1,275.30 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి: హెచ్డీ టీవీ, సెట్‌టాప్ బాక్స్ ఉచితంగా పొందండిలా...