ETV Bharat / business

Fortune Global 500: ఎస్​బీఐ భళా- రిలయన్స్ డీలా! - రిలయన్స్ ఫార్చూన్ 500

ఫార్చూన్ గ్లోబల్ 500(Fortune Global 500) సంస్థల జాబితాలో రిలయన్స్.. 59 స్థానాలు కోల్పోయింది. ఆదాయాలు పడిపోవడం వల్ల.. 155 స్థానానికి పరిమితమైంది. మరోవైపు, ఎస్​బీఐ 16 స్థానాలు ఎగబాకి 205వ ర్యాంకు​ను సాధించింది.

Fortune Global 500
ఫార్చూన్ గ్లోబల్ 500
author img

By

Published : Aug 2, 2021, 7:56 PM IST

ఫార్చూన్ గ్లోబల్ 500(Fortune Global 500) కంపెనీల ర్యాంకింగ్స్​లో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) డీలా పడింది. సోమవారం విడుదలైన ఈ జాబితాలో ఏకంగా 59 స్థానాలు పడిపోయి 155వ స్థానానికి పరిమితమైంది. 2017 తర్వాత కంపెనీకి ఇదే అతి తక్కువ ర్యాంకింగ్.

2020 రెండో త్రైమాసికంలో ఇంధన ధరలు తగ్గడం వల్ల.. రిలయన్స్ రెవెన్యూ 25.3 శాతం పడిపోయి 63 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఈ కారణం వల్లే సంస్థ ర్యాంకింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది.

చమురు కంపెనీలపై పిడుగు

అంతర్జాతీయ ఆయిల్ ధరల ప్రభావంతో ఇతర భారతీయ చమురు సంస్థల ర్యాంకింగ్​లు సైతం పడిపోయాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 61 స్థానాలు కోల్పోయి 212 స్థానానికి పడిపోయింది. ఓఎన్​జీసీ 53 స్థానాలు కోల్పోయి 243 ర్యాంకును దక్కించుకుంది.

మరోవైపు, వరుసగా రెండో ఏడాదీ తన ర్యాంకును మెరుగుపర్చుకున్న ఎస్​బీఐ.. 16 స్థానాలు ఎగబాకింది. ప్రస్తుత జాబితాలో 205 ర్యాంకును దక్కించుకుంది. రాజేశ్ ఎక్స్​పోర్ట్స్​ సంస్థ ఏకంగా 114 స్థానాలు ఎగబాకి 348కి చేరింది. టాటా మోటార్స్ 20 స్థానాలు కోల్పోయి 357కు పరిమితం కాగా.. బీపీసీఎల్ 394వ ర్యాంకును దక్కించుకుంది.

అగ్రస్థానంలో వాల్​మార్ట్

కాగా, ఈ జాబితాలో వాల్​మార్ట్ సంస్థ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సంస్థ రెవెన్యూ 524 బిలియన్ డాలర్లుగా తేలింది. ఆ తర్వాతి స్థానంలో 384 బిలియన్ డాలర్లతో చైనా స్టేట్ గ్రిడ్ నిలిచింది. అమెజాన్(280 బిలియన్ డాలర్లు), చైనా నేషనల్ పెట్రోలియం, సినోపెక్ గ్రూప్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాయి. ఆరో స్థానంలో నిలిచిన యాపిల్.. 57 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేసింది. సౌదీ ఆరామ్​కోను వెనక్కి నెట్టి.. అత్యధిక లాభం గడించిన సంస్థల్లో తొలి స్థానాన్ని సంపాదించింది. 2021 మార్చి 31 నాటికి సంస్థల వార్షిక ఆదాయాలను బట్టి ఈ ర్యాంకింగ్​ను ఇచ్చింది ఫార్చూన్.

మెయిన్​ల్యాండ్ చైనా(హాంకాంగ్ సహా) నుంచి అత్యధికంగా 135 కంపెనీలు ఉన్నాయి. తైవాన్​ను కలుపితే చైనా సంస్థల సంఖ్య 143. ఆ తర్వాతి స్థానంలో అమెరికా(122), జపాన్(53) ఉన్నాయి.

టాప్ 500 కంపెనీలు కలిసి.. ప్రపంచ జీడీపీలో మూడింట ఒక వంతు రెవెన్యూ సంపాదిస్తున్నాయి. ఈ సంస్థలు 31.7 ట్రిలియన్ డాలర్ల రెవెన్యూ, 1.6 ట్రిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేశాయి. ఈ సంస్థలన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల 97 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఇదీ చదవండి: జులైలో భారీగా పెరిగిన ఎగుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.