దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ 'జియో మీట్' యాప్‌ను విపణిలో ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా 100 మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యేందుకు వీలు కలుగుతుందని ప్రకటించింది.
కరోనా విజృంభణ వేళ.. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, సిస్కో వెబెక్స్, గూగుల్ మీట్ సహా ఇతర సంస్థల వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ల వినియోగం పెరిగిన నేపథ్యంలో జియో మీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్.
ఉచితంగా..
వెబ్ కాన్ఫరెన్సింగ్ యాప్‌లు ఇప్పటివరకు ఈ సదుపాయానికి కొంత సొమ్ము వసూలు చేస్తుండగా.. జియో మాత్రం ఎలాంటి రుసుములు ఛార్జి చేయట్లేదని వెల్లడించింది. కాన్ఫరెన్స్ సమయానికి ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడులు