ETV Bharat / business

'జియో' డేటా విప్లవానికి నాలుగేళ్లు

మన దేశంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుడుతూ.. డేటా విప్లవానికి తెర తీసింది రిలయన్స్​ జియో. మొదటి నుంచే ఎన్నో సంచలనాలు సృష్టించిన జియో నాలుగేళ్లు పూర్తి చేసుకొని, ఐదో ఏట అడుగుపెడుతోంది. భవిష్యత్తులో మరికొన్ని అద్భుతాలు సృష్టించటానికి సన్నద్ధమవుతోంది.

Reliance jio completes four years
'జియో' డేటా విప్లవానికి నాలుగేళ్లు
author img

By

Published : Sep 5, 2020, 5:14 AM IST

తిండి, బట్ట, గూడు... ఎవరికైనా ఇవే అత్యవసరం. కానీ ఇప్పుడు ఒక పూట తిండి లేకపోయినా పర్వాలేదు. కానీ 'డేటా' లేకపోతే మాత్రం గంటయినా గడవదు. మనిషి నిత్యజీవితంలో విడదీయరాని భాగం ఏదైనా ఉందంటే..., అది డేటా సదుపాయమే. విద్య, వినోదం, సమాచారం, నగదు చెల్లింపులు, నగదు జమ, ఫొటోలు- వీడియోలు, ఫైళ్లు షేర్‌ చేయటం.. ఇలా ఎన్నో అవసరాలకు డేటానే ప్రాణాధారం. మనదేశంలో ఈ వినూత్నమైన విప్లవానికి తెరతీసిన ఘనత ఎవరిదనే ప్రశ్న వస్తే... రిలయన్స్‌ జియోదే అని నిస్సందేహంగా చెప్పవచ్ఛు ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టిన రిలయన్స్‌ జియో నాలుగేళ్లు పూర్తి చేసుకొని, ఐదో ఏట అడుగుపెడుతోంది. భవిష్యత్తులో మరికొన్ని అద్భుతాలు సృష్టించటానికి సన్నద్ధమవుతోంది.

2016, సెప్టెంబరు 5.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎం (వాటాదార్ల సర్వసభ్య సమావేశం) లో ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ మాట్లాడుతూ, మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా మనదేశం 155వ స్థానంలో ఉందని చెప్పారు. అప్పుడే 'జియో' 4జీ ఎల్‌టీఈ సేవలను ఆవిష్కరించారు. ఈ నాలుగేళ్లలో మనదేశంలో డేటా వినియోగం నెలకు 300 మిలియన్ల జీబీ నుంచి 6 బిలియన్ల జీబీకి పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇందులో 60 శాతం రిలయన్స్‌ జియో వాటా ఉండటం. అంటే మొబైల్‌ డేటా ట్రాఫిక్‌ 1900% పెరిగిందన్నమాట.

నెలకు 10 జీబీ డేటా..

మనదేశంలో ప్రస్తుతం సగటున నెలకు ఒక వినియోగదారుడు 10.4 జీబీ డేటా వినియోగిస్తున్నాడు. 2016లో ఇది 0.24 జీబీ మాత్రమే. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో డేటా వినియోగం 25 శాతం పెరిగింది. అదే సమయంలో డేటా ధరలు అనూహ్యంగా తగ్గాయి. నలుగురు సభ్యులు కల ఒక కుటుంబం ఇప్పుడు నెలకు 50 జీబీ వినియోగిస్తోంది. అందుకు అయ్యే ఖర్చు రూ.400 నుంచి రూ.500 మాత్రమే. జియో రాక ముందు ఒక్కో జీబీకి రూ.200 వరకూ వెచ్చించాల్సి వచ్చేది. ధర తగ్గటంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. జియో విప్లవం డేటాకే పరిమితం కాలేదు. వాయిస్‌ కాల్స్‌ వినియోగం ఈ నాలుగేళ్లలో దాదాపు రెట్టింపు కావటం గమనార్హం.

భవిష్యత్తు ఏంటి?..

సరే.., ఇదంతా గతం. భవిష్యత్తు ఏంటి ? అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిలయన్స్‌ జియో నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జియో ప్లాట్‌ఫామ్స్‌ విభాగంలోకి రూ. ఒక లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఇటీవల సమీకరించిన విషయం తెలిసిందే. కొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలతో పాటు ఫేస్‌బుక్‌, గూగుల్‌, క్వాల్‌కామ్‌ ఇంటెల్‌ తదితర అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలు పెట్టుబడులు తీసుకువచ్చాయి. తద్వారా 5జీ ఆధారిత సేవల్లో జియో క్రియాశీలకంగా వ్యవహరించనుందని స్పష్టమవుతోంది. జియోమార్ట్‌, జియో ఫైబర్‌ ప్లాన్స్‌ ను ఇప్పటికే ఆవిష్కరించింది. ఇంకా..., గూగుల్‌తో కలిసి 4జీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ అదే సమయంలో ఆదాయాలు పెంచుకోవటం ఎలా...? అనే సవాలు రిలయన్స్‌ జియో ముందు ఉంది. టెలికామ్‌ సేవల్లో ధరల పోరాటానికి తెరతీయటం ద్వారా మార్కెట్లో ప్రత్యర్థులను మించిపోయేందుకు, వినియోగదార్లను ఆకట్టుకునేందుకు ఈ సంస్థకు అవకాశం లభించింది. ఈ క్రమంలో ఒక వినియోగదారుడి నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) గత రెండేళ్లలో గణనీయంగా తగ్గిపోయింది. కాకపోతే దేశీయ టెలికామ్‌ రంగంలో రెండు మూడు సంస్థలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉన్నందున ధరలు పెంచుకునే అవకాశం భవిష్యత్తులో లభిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకెన్నో సేవలను ఆవిష్కరించి వినియోగదార్లకు దగ్గర కావటానికి ఈ సంస్థ ప్రయత్నిస్తోందనడంలో సందేహం లేదు.

ఇదీ చూడండి: ఆండ్రాయిడ్ యాప్‌లు పీసీలో..ఎలానో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.