టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ వేగం వరుసగా రెండో నెలలోనూ క్షీణించింది. అయితే.. 4జీ నెట్‌వర్క్‌లో ఇప్పటికీ జియోనే ప్రముఖ ఆపరేటర్‌గా నిలిచింది. ఈ మేరకు ట్రాయ్ ఒక నివేదికను విడుదల చేసింది.
రిలయన్స్ జియో 4జీ డౌన్‌లోడ్ వేగం సగటు 15.4 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు ట్రాయ్ వెల్లడించింది. ఈ వేగం 2021 జనవరిలో 17.9 ఎంబీపీఎస్‌గా ఉండగా.. 2020 డిసెంబర్‌లో 20.2గా నమోదైంది. ఇక వొడాఫోన్ సగటు 4జీ డౌన్‌లోడ్ వేగం 9.2 ఎంబీపీఎస్ కాగా.. ఐడియా వేగం 8 ఎంబీపీఎస్‌గా ఉన్నట్లు తెలిపింది. 7.2 ఎంబీపీఎస్ సగటు డౌన్‌లోడ్ వేగంతో భారతి ఎయిర్‌టెల్ చివరి స్థానంలో నిలిచింది.
అప్‌లోడ్ వేగంలో చూస్తే.. వొడాఫోన్ 7.2 ఎంబీపీఎస్ వేగంతో ముందంజలో నిలిచింది. ఈ జాబితాలో ఐడియా రెండో స్థానంలో(6.4ఎంబీపీఎస్) ఉంది. భారతి ఎయిర్‌టెల్ 4.2, రిలయన్స్ జియో 3.6 ఎంబీపీఎస్ వేగంతో ఉన్నాయి.
డౌన్‌లోడ్ స్పీడ్‌లో రిలయన్స్ జియోను అత్యంత వేగవంతమైన ఆపరేటర్‌గా ట్రాయ్ గుర్తించగా.. టుటెలా, ఓక్లా వంటి ఇతర ప్రైవేటు సంస్థలు భారతి ఎయిర్‌టెల్‌కి అత్యంత వేగవంతమైన ఆపరేటర్‌గా రేటింగ్ ఇచ్చాయి.
ఇదీ చదవండి: చౌకగా జియో 5జీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు..