వరుసగా రెండో సెషన్లోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు (Reliance Industries Shares) భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ ప్రకారం.. రిలయన్స్ షేరు ప్రస్తుతం 2.22 శాతం బలపడి (Reliance Industries Share price) రూ.2,441.35 వద్ద కొనసాగుతోంది. ఇదే సెషన్లో ఈ షేరు విలువ జీవితకాల గరిష్ఠమైన రూ.2,479.85 మార్క్‌ను తాకింది.
వరుస లాభాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ (Reliance Industries M-cap) ప్రస్తుతం రూ. 15.45 లక్షల కోట్ల పైకి చేరింది.
సౌదీ ఆరామ్కో డీల్, సగటున ఒక యూజర్ నుంచి జియో ఆదాయం రూ.160-170 మధ్య ఉన్నట్లు ప్రకటించడం.. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కోసం భారీ పెట్టుబడుల వంటి అంశాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ స్థాయిలో లాభాలను నమోదు చేసేందుకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. ఇదే జోరు కొనసాగితే.. రానున్న 9-12 నెలల్లో కంపెనీ షేరు విలువ రూ.3000 మార్క్‌ను అందుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఐఆర్సీటీసీ షేర్ల దూకుడు..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) షేర్లు కూడా సోమవారం భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈఎలో సంస్థ షేరు దాదాపు 5 శాతం పుంజుకుని.. (IRCTC Share Price) రూ.3000.90 వద్ద కొనసాగుతోంది.
దీనితో సంస్థ మార్కెట్ క్యాపిటల్ (IRCTC M-cap) రూ.50 వేల కోట్లకు చేరువైంది.
ఇదీ చదవండి: పెరిగిన మారుతీ కార్ల ధరలు- ఏ మోడల్‌పై ఎంతంటే?