ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేడు భారీగా పుంజుకుంటున్నాయి. వరుసగా 4 రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ నేడు 7 శాతానికిపైగా లాభంతో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.
కారణం..
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ వారి వారసులు వ్యక్తిగత వాటాలను పెంచుకున్నారు. గురువారం జరిగిన ఈ వాటాల కొనుగోలు ప్రభావంతో రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
వరుసగా 4 సెషన్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 17.14 శాతం పతనం అయ్యాయి. నేటి లాభాలతో(మిడ్ సెషన్ తర్వాత వరకు) అందులో 7 శాతానికిపైగా రికవరీ సాధించాయి.
షేర్ల వృద్ధి ఇలా..
సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం 7.56 శాతం లాభం(రూ.986.45) వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీలోనూ 7.38 శాతం లాభంతో షేరు విలువ రూ.985.45 వద్ద కొనసాగుతోంది.
పెరిగిన వాటాలు ఇలా..
పేరు | ఇంతకు ముందు (లక్షల షేర్లలో) | ప్రస్తుతం (లక్షల షేర్లలో) |
ముకేశ్ అంబానీ | 72.31 | 75 |
నీతా అంబానీ | 67.96 | 75 |
ఆకాశ్, ఇషా | 62.7 | 75 |
- అందరికన్నా చిన్న వాడైన అనంత్ అంబానీ వాటా రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఇంతకు ముందు 2 లక్షల షేర్లుగా ఉండేది. అతని వాటా ఇప్పుడు 75 లక్షల షేర్లకు పెరిగింది.
ఇదీ చూడండి:'2020-21లో భారత వృద్ధి రేటు 5.1శాతమే'