చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ 'రియల్మీ' నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తులు రాబోతున్నాయి. వివిధ రకాల స్మార్ట్ టీవీలు, ఫిట్నెస్ బ్యాండ్ సహా అనేక ఉత్పత్తుల్ని భారత మార్కెట్‌కు పరిచయం చేయబోతోంది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో మాధవ్ సేఠ్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వెల్లడించారు.
రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, 2020 రెండో త్రైమాసికం కల్లా వాటిని భారత్‌లో విడుదల చేస్తామని చెప్పారు సేఠ్. కానీ ఉత్పత్తుల మోడల్స్ గురించి ఆయన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. తమ బ్రాండ్‌కు చెందిన పరికరాలన్నీ ఉపయోగించేందుకు ‘రియల్మీ లింక్’ యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అది యూనివర్సల్ కంట్రోల్ హబ్‌గానే కాకుండా.. స్మార్ట్ హోం యాప్ మాదిరి పనిచేయనున్నట్లు సమాచారం.
ఆ సంస్థ నుంచి వెలువడబోయే మరిన్ని ఉత్పత్తుల గురించి ఫిబ్రవరి 24న నిర్వహించే 'రియల్మీ ఎక్స్50 ప్రొ' మొబైల్ విడుదల కార్యక్రమంలో వెల్లడికానున్నట్లు టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.