భారత విపణిలో మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్మీ. రియల్మీ ఎక్స్, రియల్మీ 3ఐ పేర్లతో వీటిని విడుదల చేసింది.
రియల్మీ ఎక్స్ ప్రత్యేకతలు
'రియల్మీ ఎక్స్'ను నాచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో తీసుకువచ్చింది సంస్థ. పాప్-అప్ కెమెరాతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌తో ఇప్పటికే మార్కెట్లో ఉన్న.. ఎంఐ నోట్ 7ప్రో, వీవో జెడ్1 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం 40 వంటి మోడళ్లకు పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది రియల్మీ. ఈ స్మార్ట్ ఫోన్లో 48, 5 మెగా పిక్సల్స్తో రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచింది రియల్మీ.
రియల్మీ ఎక్స్ 4జీబీ ర్యామ్/128 జీబీ రోమ్, 8జీబీ ర్యామ్/128 జీబీ రోమ్ రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.16,999, రూ.19,999లుగా నిర్ణయించింది.
రియల్మీ 3ఐ ప్రత్యేకతలు
రియల్మీ 3ఐనీ 3జీబీ ర్యామ్/32 జీబీ రోమ్, 4 జీబీ ర్యామ్/64 జీబీ రోమ్ వేరియంట్లలో విడుదల చేసింది ఆ సంస్థ. వీటి ధరలు రూ.7,999, రూ.9,999గా నిర్ణయించింది. ఇందులో 13, 2 మెగా పిక్సల్స్తో రియర్ కెమెరా, 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచింది రియల్మీ.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు జులై 24 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అమ్మకానికి రానున్నట్లు రియల్మీ తెలిపింది.
ఇతర ప్రధాన ఫీచర్లు....
రియల్మీ ఎక్స్:
- 6.53 అంగుళాలు ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే అమోలెడ్ స్క్రీన్
- కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
- డాల్బి అట్మాస్
- స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 9 పై, కలర్ ఓఎస్ 6.0
- 3,765 ఎంఏహెచ్ బ్యాటరీ
- ఒప్పో వూక్ ఫ్లాస్ ఛార్జింగ్ 3.0
రియల్మీ 3ఐ:
- 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే
- గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
- ఆండ్రాయిడ్ పై, కలర్ 6 ఓఎస్
- 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ
- మీడియా టెక్ హీలియో పీ60-ఆక్టా కోర్ ప్రాసెసర్