జూన్‌లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష(ఎంపీసీ)లో రేపో రేటును ఆర్బీఐ మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్స్ (డీ&బీ) తాజా నివేదికలో అంచనా వేసింది.
దేశీయ పరిశ్రమల ఉత్పాదనలో తగ్గుదల సహా అంతర్జాతీయంగా వాణిజ్య మందగమనం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.
జూన్ 3,4,6 తేదీల్లో ఎంపీసీ సమావేశం నిర్వహించనుంది ఆర్బీఐ.
ముఖ్యంగా అమెరికా వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై అధికంగా ఉన్నట్లు తెలిపింది డీ అండ్ బీ.
"రుతుపవనాల ఆలస్యం కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దీని ఫలితంగా కూరగాయలు, చమురు ధరలు పెరగొచ్చు. అయినప్పటికీ.. వృద్ధికి ఊతమందించే దిశగానే ఎంపీసీ నిర్ణయం ఉండొచ్చు." - అరుణ్ సింగ్, ప్రధాన ఆర్థికవేత్త, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా
డీఅండ్‌బీ అంచనా ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ... ఏప్రిల్‌లో అంతకు ముందు నెలలతో పోలిస్తే స్వల్పంగా (2-3 శాతం) వృద్ధి చెందే అవకాశం ఉంది.