సొరియాసిస్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఇటోలిజుమాబ్ ఇంజెక్షన్‌ను కొవిడ్-19 బాధితులకు పరిమితంగా వాడేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతించింది. కరోనా బారిన పడి తీవ్రంగా లేదా మోస్తరుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి పరిమితంగా ఇటోలిజుమాబ్‌ను వినియోగించవచ్చని తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్‌లో వైరస్ బాధితులపై ఇటోలిజుమాబ్ సంతృప్తికర స్థాయిలో ప్రభావం చూపిన నేపథ్యంలో పరిమితంగా వాడేందుకు వైద్య నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపంది. సొరియాసిస్ వ్యాధి బాధితుల చికిత్స కోసం ఎప్పటి నుంచో ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.
ఇదీ చూడండి: 'జీతాల చెల్లింపులకు భారతీయ సంస్థల కష్టాలు'